52వ డివిజన్ తంగవేలు కాలనీలో యువ కార్పొరేటర్ పీఎస్ చందు ప్రచారం జోరు మేయర్ గా కటారి హేమలతను భారీ మెజారిటీతో గెలిపించండి
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:చిత్తూరు నగర మేయర్ గా కూటమి అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు 52వ డివిజన్ తంగవేలు కాలనీలో డివిజన్ కార్పొరేటర్ పీఎస్ చందు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా తంగవేలు కాలనీలో ఇంటింటికీ తిరిగి మేయర్ అభ్యర్థి కటారి హేమలతకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కాలనీవాసులను కోరారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్, తెదేపా సీనియర్ నాయకులు పి. షణ్ముగం మాట్లాడుతూ గత రెండున్నరేళ్లుగా ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆధ్వర్యంలో చిత్తూరు నగరం ఎన్నడూ లేనంత అభివృద్ధి సాధించిందన్నారు. రోడ్ల వెడల్పు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణంతో నగర రూపురేఖలు మారాయన్నారు. మేయర్ గా కటారి హేమలత గెలిస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని, కావున తంగవేలు కాలనీ ప్రజలు అందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.52వ డివిజన్ పరిధిలో సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని యువ కార్పొరేటర్ పీఎస్ చందు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్ లవ కుమార్