పొదలకూరు బిట్-2లో వైసీపీ అభ్యర్థి వాకాటి సంధ్య విస్తృత ప్రచారం
పొదలకూరు, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పొదలకూరు బిట్-2 వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి వాకాటి సంధ్య ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శనివారం ఊకోటి రామయ్య శ్రామిక నగర్, వినాయక మన్యం ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి, కాలనీల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.