*మద్దికుంటలో ఘనంగా దేవి నవరాత్రుల నిమజ్జనోత్సవం*
సదాశివపేట;మద్దికుంట గ్రామంలో దేవి నవరాత్రుల ఉత్సవాల ముగింపు సందర్భంగా నిమజ్జనోత్సవ మహోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవి సింగ్ పాల్గొన్నారు.లక్కీ డ్రాలో విజేతలకు సైకిల్ బహూకరణ దేవి నవరాత్రుల సందర్భంగా దుర్గామాత సన్నిధిలో భక్తుల కోసం గ్రామస్తులు ఏర్పాటు చేసిన లక్కీ డ్రాను పులిమామిడి రాజు చేతుల మీదుగా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన మన్నె పద్మ–క్రిష్ణ దంపతులకు ఆయన సైకిల్‌ను బహూకరించారు. భక్తుల కోసం చక్కటి ఏర్పాట్లు చేసి, ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన మద్దికుంట గ్రామస్తులను పులిమామిడి రాజు అభినందించారు.ఐకమత్యంతోనే అభివృద్ధి సాధ్యం ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ, గ్రామ ప్రజలందరూ ఒకే చోట చేరి ఐకమత్యంతో పండుగను జరుపుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఇలాంటి పండుగలు గ్రామ ప్రజల మధ్య సోదరభావాన్ని, ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ ఐకమత్యంగా ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని, గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. దేవి నవరాత్రుల సందర్భంగా భక్తుల కోసం చక్కటి ఏర్పాట్లు చేసిన గ్రామస్తుల కృషి అభినందనీయమని పేర్కొంటూ, భవిష్యత్తులోనూ గ్రామంలో ఇలాంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు ఐకమత్యంతో నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మద్దికుంట గ్రామ సర్పంచ్ దేవి సింగ్, వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీ మమత, మాజీ ఉపసర్పంచ్ సుభాన్, జుట్టు హరిచందర్ రెడ్డి, కోలుకుందె వెంకట్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మాందాపురం విట్టల్, జగన్నాథ్ రెడ్డి, చెప్పు వెంకట్, బెలూరు వెంకట్ రెడ్డి, భవానీ మాత అసోసియేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దుర్గామాత నామస్మరణలు, భక్తుల సందడి మధ్య నిమజ్జనోత్సవ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.