BREAKING
కుందుర్పి లో స్థానిక ఎన్నికల ఎంపిటిసి,జడ్పిటిసి లకు 113 మంది ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు నలుగురు నామినేషన్ వేశారు. మద్ది ఆలయానికి రూ.2.56 లక్షల ఆదాయం నామినేషన్ల పరిశీలన అనంతరం.. పొదలకూరు మండల పరిషత్ బరిలో 87 మంది అభ్యర్థులు.. ఎస్సి అభివృద్ధి శాఖ కమీషనర్ ను కలిసిన పియు వీసీ శ్రీనగర్ వేదికగా మూడో విడత కాశ్మీర్ మారథాన్ భట్టిప్రోలు మండల ప్రజా పరిషత్ నామినేషన్ లు 61 చెల్లుబాటు అయ్యాయి వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం: గడువు కంటే 5 నెలల ముందే 11 కోట్ల 'రైతు ఐడీల' లక్ష్యం పూర్తి.. కేంద్ర వ్యవసాయ శాఖ చారిత్రక మైలురాయి! 20వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సాయినాను గెలిపించండి. మాజీ కార్పొరేటర్ ఎస్కే బాబు డీ-లిమిటేషన్ 35 వార్డుల నుండి 48 వార్డులుతాడేపల్లిగూడెం పురపాలక సంఘం లో 1,00,728 మంది ఓటర్లు 54వార్డు లో వైసీపీ విశృత ప్రచారం డిజిపి ని తోలుబొమ్మ తో పోల్చిన జగన్ ని అరెస్ట్ చేయాలి - కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ వేల్పురి ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భారత్, ఉగ్రవాదంపై పోరుకు స్పష్టమైన పునరుద్ఘాటన తమిళనాడులో భారీ వర్షాల హెచ్చరిక.. సహాయక చర్యల్లో ప్రభుత్వం మరింత చొరవ చూపాలి: కోయంబత్తూరులో టీఎంసీ అధ్యక్షుడు జి.కె. వాసన్ డిమాండ్! రూ.400 కోట్ల అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు.. బహిరంగ చర్చకు సిద్ధం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ వర్ధన్ రెడ్డి ఢిల్లీలో వాయు కాలుష్య మూలాల గుర్తింపునకు అత్యాధునిక ల్యాబ్ ప్రారంభం

విధులకు డుమ్మా.. 54 మంది లైసెన్స్‌ సర్వేయర్ల సేవలు రద్దు

Select Suryaa Now
విధులకు డుమ్మా.. 54 మంది లైసెన్స్‌ సర్వేయర్ల సేవలు రద్దు

షోకాజ్‌ నోటీసులకు స్పందించకపోవడంతో చర్యలు

రీ సర్వే పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు: అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి

రంగారెడ్డి, మేజర్ న్యూస్ (అక్టోబరు 24): విధులకు హాజరుకాకుండా, షోకాజ్‌ నోటీసులకు స్పందించని 54 మంది లైసెన్స్‌ సర్వేయర్ల సేవలను రద్దు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) చంద్రారెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం 281 మంది లైసెన్స్‌ సర్వేయర్లను నియమించగా, వారిలో 102 మంది విధులకు గైర్హాజరైనట్లు గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. వీరిలో 48 మంది నోటీసులకు స్పందించి తిరిగి విధుల్లో చేరగా, మిగిలిన 54 మంది నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారి సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

రీ సర్వేలో కీలక బాధ్యతలు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ రీ సర్వే కార్యక్రమంలో లైసెన్స్‌ సర్వేయర్ల పాత్ర అత్యంత కీలకమని చంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వేయర్లంతా విధులకు హాజరై, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. రీ సర్వే పనుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని స్పష్టం చేశారు.

గైర్హాజరైతే చర్యలు తప్పవు

విధులకు హాజరుకాకపోవడం, అధికారుల ఆదేశాలను పాటించకపోవడం వంటి చర్యలను ఉపేక్షించబోమని అదనపు కలెక్టర్‌ హెచ్చరించారు. విధులకు గైర్హాజరైన సర్వేయర్ల స్థానంలో కొత్త లైసెన్స్‌ సర్వేయర్లను నియమించి, రీ సర్వే పనులు నిరంతరాయంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిగిలిన సర్వేయర్లంతా ఈ విషయాన్ని గమనించి, విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చంద్రారెడ్డి సూచించారు.