BREAKING
గౌరవప్రదంగా జీవించాలి ---జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ టిడిపి, జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి 20 మంది యువకులు నెల్లూరుపాలెంలో కూటమి ఐక్యత సాధించిన బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్టు మర్తిడి లో డ్రగ్స్, గంజాయి సాగు, వినియోగంపై అవగాహన కార్యక్రమం...... చంద్రగిరిలో 142 నామినేషన్ల తిరస్కరణ..! – ఓటమి భయంతోనే అడ్డగోలు తిరస్కరణలంటూ మోహిత్‌రెడ్డి ఆరోపణ త్వరితగతిన బియ్యం సరఫరా చేయాలి మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు పీఎం రాహత్ పథకంను సద్వినియోగం చేసుకోవాలి కౌసర్ ప్రచార హోరు.. 32 వ డివిజన్ లో కూటమి అభ్యర్థికి విశేష ఆదరణ.. చిరుత సంచారంపై ఏఐ ఫోటోలు పెడితే కఠిన చర్యలు.. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదానం శిబిరం.. రీసర్వే భూములను పరిశీలించిన అదనపు కలెక్టర్ హాలీవుడ్ ఆఫర్లపై స్పందించిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ వెసులుబాటు దక్కిందంటూ కీలక వ్యాఖ్యలు!

మద్ది ఆలయానికి రూ.2.56 లక్షల ఆదాయం

Select Suryaa Now
మద్ది ఆలయానికి రూ.2.56 లక్షల ఆదాయం

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్ మండలంలోని గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానానికి శనివారం వివిధ సేవల రూపంలో రూ.2,56,653 ఆదాయం సమకూరినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.వి.చందన తెలిపారు. తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువుగా వెలసిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఈ సందర్భంగా ఉదయం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ.2,56,653 ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు.

అలాగే సాయంత్రం ఆలయానికి విచ్చేసిన సుమారు 3,253 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదం అందించినట్లు ఆర్.వి.చందన వివరించారు.