బాలసదన్‌లో విద్యార్ధులకు ఫౌష్టికాహారం పంపిణీ
గూడూరు, మేజర్‌న్యూస్ : గూడూరు రెండో పట్టణ పరిధిలోని బాలసదన్ వసతి గృహంలో విద్యార్ధులకు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫౌష్టికాహారం పంపిణృ చేశారు. శనివారం చెన్నూరు మస్తాన్ రావు దంపతుల కుమార్తె లాస్య ప్రియ జన్మదిన వేడుకలను బాలసదన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సమక్షంలో కేక్ కట్ చేసి, అందరికీ పంచిపెట్టారు. అనంతరం వసతి గృహంలోని విద్యార్థినులకు ఆహరం, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు బాలకృష్ణ గౌడ్, గూడూరు డివిజన్ ఉపాధ్యక్షులు ఆత్మకూరు సురేష్ బాబులు ముఖ్యయఅతిధులగా పాల్గొన్నారు. వాళ్లు మాట్లడుతూ పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎఫ్ గూడూరు డివిజన్ కార్యదర్శి చెన్నూరు మస్తాన్ రావు, చిరంజీవి, లాస్య ప్రియ కుటుంబ సభ్యులు, బాలసదన్ వసతి గృహ వార్డెన్ అరుణ తదితరులు పాల్గొన్నారు.