BREAKING
ఘనపూర్‌లో భూ భారతి భూ సర్వేపై అవగాహన సదస్సు కుందుర్పి లో స్థానిక ఎన్నికల ఎంపిటిసి,జడ్పిటిసి లకు 113 మంది ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు నలుగురు నామినేషన్ వేశారు. మద్ది ఆలయానికి రూ.2.56 లక్షల ఆదాయం నామినేషన్ల పరిశీలన అనంతరం.. పొదలకూరు మండల పరిషత్ బరిలో 87 మంది అభ్యర్థులు.. ఎస్సి అభివృద్ధి శాఖ కమీషనర్ ను కలిసిన పియు వీసీ శ్రీనగర్ వేదికగా మూడో విడత కాశ్మీర్ మారథాన్ భట్టిప్రోలు మండల ప్రజా పరిషత్ నామినేషన్ లు 61 చెల్లుబాటు అయ్యాయి వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం: గడువు కంటే 5 నెలల ముందే 11 కోట్ల 'రైతు ఐడీల' లక్ష్యం పూర్తి.. కేంద్ర వ్యవసాయ శాఖ చారిత్రక మైలురాయి! 20వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సాయినాను గెలిపించండి. మాజీ కార్పొరేటర్ ఎస్కే బాబు డీ-లిమిటేషన్ 35 వార్డుల నుండి 48 వార్డులుతాడేపల్లిగూడెం పురపాలక సంఘం లో 1,00,728 మంది ఓటర్లు 54వార్డు లో వైసీపీ విశృత ప్రచారం డిజిపి ని తోలుబొమ్మ తో పోల్చిన జగన్ ని అరెస్ట్ చేయాలి - కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ వేల్పురి ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భారత్, ఉగ్రవాదంపై పోరుకు స్పష్టమైన పునరుద్ఘాటన తమిళనాడులో భారీ వర్షాల హెచ్చరిక.. సహాయక చర్యల్లో ప్రభుత్వం మరింత చొరవ చూపాలి: కోయంబత్తూరులో టీఎంసీ అధ్యక్షుడు జి.కె. వాసన్ డిమాండ్! రూ.400 కోట్ల అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు.. బహిరంగ చర్చకు సిద్ధం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ వర్ధన్ రెడ్డి

నీటిని వృధా చేయకండి భవిష్యత్తును కాపాడండి: నరేష్ యాదవ్

Select Suryaa Now
నీటిని వృధా చేయకండి భవిష్యత్తును కాపాడండి: నరేష్ యాదవ్

నీటిని వృధా చేయకండి....భవిష్యత్తును కాపాడండి, నరేష్ యాదవ్ పిలుపు      

                         ఎండాకాలం ఇంకా రాలేదు.... అప్పుడే జల్ పల్లి సర్కిల్లోని పలు ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయని జల్ పల్లి 65వ డివిజన్ బిజెపి నాయకులు పేరామోని నరేష్ యాదవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ఒ ప్రకటన ద్వారా మాట్లాడుతూ. జల్ పల్లి డివిజన్ పరిధిలో నీటి విలువలను గుర్తించి, ఇప్పటినుంచే పొదుపు చర్యలు చేపట్టాలని, రానున్న రోజుల్లో నీటి ఎద్దడి మరింత పెరిగే అవకాశం ఉందని, నీటిని జాగ్రత్తగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. నీరే జీవనాధారమని.... నీరే భవిష్యత్తుకు ఆధారమని.... మన వంతుగా కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. అవసరం లేనప్పుడు కుళాయిలను మూసివేసి, లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేయాలన్నారు. అవసరమైనంత నీటిని వినియోగిస్తూ, నీరు వృధా కాకుండా అరికట్టాలన్నారు. రాబోయే రోజులలో వర్షపు నీటిని వడిసి పట్టి భూగర్భజలాలను పెంచుకుందామన్నారు. ప్రతి నీటి చుక్క విలువైనదిగా భావించి భవిష్యత్తు తరాలకు నీటి భద్రతను అందిద్దామని పిలుపునిచ్చారు. నీటి సమస్య మన ఒక్కరిది కాదని మన అందరి బాధ్యత అని, ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు నీటి సంరక్షణలో భాగస్వాములము అవ్వాలని కోరారు. మన ప్రాంతంలో నీటి ఎద్దడిని తగ్గించేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు.   

   

             అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.