వైభవంగా శ్రీ బాలాజీ కళ్యాణం..
వైభవంగా శ్రీ బాలాజీ కళ్యాణం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని ప్రముఖ వైష్ణవాలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం శ్రీ బాలాజీ కళ్యాణం వైభవంగా, కనుల పండువగా జరిగింది. ఆలయ మేనేజర్ పాకల వెంకటరమణ పర్యవేక్షణ నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాపురం ప్రసాదాచార్యులు వేద మంత్రొచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి కళ్యాణ ఘట్టం వైభవంగా సాగింది. ఉదయం నుండి స్వామివారికి అభిషేకం అర్చన,సహస్రనామార్చన నిర్వహించిన అనంతరం కల్యాణ ఘట్టాన్ని ప్రారంభమైంది, జిలకర్ర బెల్లం, మాంగల్య ధారణ ఘట్టాన్ని భక్తులు భక్తి పరవశ్యంతో తిలకించారు. కళ్యాణం అనంతరం స్వామి వారికి ప్రత్యేక హారతి మహా నివేదన సమర్పించారు. భక్తులందరికీ ములకలపల్లి మండలం రామచంద్రాపురం గ్రామస్తులు బాల్ద శ్రీను మాధవి దంపతులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారి కల్యాణం వీక్షిస్తే సకల శుభాలు కలుగుతాయని, కోరిన కొరకు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.
సూర్య ప్రతినిధి, అన్నపురెడ్డిపల్లి, చందు..