BREAKING
ఆసుపత్రి బిల్లులపై బీఐఎస్ ప్రమాణాలు తప్పనిసరి చేయాలి.. క్యాప్కో చైర్మన్ జి. సురేష్ కుమార్ డిమాండ్ 15, 16, 17 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. మద్దతు తెలిపిన 20 కుటుంబాలు. కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ రంగం భారీ లక్ష్యం ఎంపీటీసీ,జడ్పీటీసీ 8 నామినేషన్ల తిరస్కరణ పొదలకూరు బిట్-2లో వైసీపీ అభ్యర్థి వాకాటి సంధ్య విస్తృత ప్రచారం భూ రీసర్వే పనులను వేగవంతం చేయాలి మొదటి దశలో ఎంపిక చేసిన 70 రెవెన్యూ గ్రామాల్లో సర్వేకు ప్రాధాన్యత ఇవ్వాలి 52వ డివిజన్ తంగవేలు కాలనీలో యువ కార్పొరేటర్ పీఎస్ చందు ప్రచారం జోరు మేయర్ గా కటారి హేమలతను భారీ మెజారిటీతో గెలిపించండి చేజర్లలో వైసీపీకి భారీ షాక్‌- టీడీపీలోకి భారీ చేరికలు వైసిపి దాడిని ఖండించిన తెలుగుదేశం పార్టీ నేత ధర్మతేజ. భీమవరంలో భారీ దొంగతనాల కేసు 24 గంటల్లో ఛేదన శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లో వరుస చోరీలు.. నిందితుడి అరెస్ట్ రూ.1.08 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం ప్రశాంత వాతావరణంలో ముగిసిన అసిస్టెంట్ సైంటిస్ట్ పరీక్ష స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లకు శిక్షణ శిబిరాలు ఈ నెల 25 నుంచి మునిపల్లి మండలం లింగంపల్లిలో ప్రారంభం దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ‘సంకల్పం’ 100 మందికి పైగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాల కోసం కొలతల సేకరణ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయం: ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ కి షాక్.... నగరం మండలంలో ఒక్క నామినేషన్ తిరస్కరణ - డబుల్ ఎంట్రీలో 6 నామినేషన్లు తొలగింపు

భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో నిబంధనలే ప్రామాణికం

Select Suryaa Now
భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో నిబంధనలే ప్రామాణికం

ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ లేదు.. ఇప్పటివరకు 3,37,439 దరఖాస్తుల పరిష్కారం.. 23,007 పెండింగ్‌.. 

టేస్రా యూనియన్‌ రంగారెడ్డి జిల్లా ప్రకటన

రంగారెడ్డి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 24) : భూ భారతి చట్టం కింద అందుతున్న భూ సమస్యల దరఖాస్తులను చట్టపరమైన నిబంధనలు, సంబంధిత రికార్డుల ఆధారంగా పారదర్శకంగా పరిశీలించి పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (టేస్రా) రంగారెడ్డి జిల్లా యూనియన్‌ స్పష్టం చేసింది. అర్హులైన రైతులు, భూహక్కుదారులకు న్యాయం చేయడంతో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొంది.

2018 తర్వాత పెండింగ్‌లో ఉన్న పార్ట్‌-బి కేసుల్లో స్పష్టమైన ఆధారాలు ఉండి, నిబంధనల ప్రకారం పరిష్కరించడానికి వీలున్న దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. అయితే అసైన్డ్‌ భూములు, మాజీ సైనికులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ బాధితుల పేర్లతో ఉన్న భూములు, వక్ఫ్‌, ఇనాం, భూదాన్‌ భూములు, శత్రు ఆస్తులు, ఎవాక్యూ ఆస్తులు, పట్టణ భూ గరిష్ఠ పరిమితి (యూఎల్‌సీ), వ్యవసాయ భూ గరిష్ఠ పరిమితి చట్టాలకు సంబంధించిన భూములు, ప్రభుత్వ భూములు, వివిధ దర్యాప్తు సంస్థల పరిధిలోని అటాచ్‌మెంట్‌ ఆస్తుల కేసులను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఈ తరహా భూములను నిషేధిత జాబితా (పీఓబీ) నుంచి తొలగించాలంటూ వచ్చే దరఖాస్తులను భూ రికార్డులు, రిజిస్ట్రేషన్‌ వివరాలు, సర్వే నివేదికలు, గత ఉత్తర్వులు, యాజమాన్య హక్కులు, సంబంధిత శాఖల నివేదికల ఆధారంగా సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కేవలం దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

రోజుకు 150 దరఖాస్తులు

రంగారెడ్డి జిల్లాలో భూ భారతి పోర్టల్‌ ద్వారా రోజుకు సుమారు 150 దరఖాస్తులు అందుతున్నాయని టేస్రా యూనియన్‌ వెల్లడించింది. ప్రతి దరఖాస్తులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడం, క్షేత్రస్థాయి వివరాలను నిర్ధారించడం, సంబంధిత శాఖల అభిప్రాయాలు సేకరించడం వంటి ప్రక్రియలకు సమయం పడుతుందని వివరించింది. మండల స్థాయిలో పరిశీలనతో పాటు అవసరమైన కేసులను కలెక్టరేట్‌ స్థాయిలోనూ సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

తగిన పరిశీలన లేకుండా నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వ ప్రయోజనాలతో పాటు చట్టబద్ధమైన భూహక్కులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల భూ సమస్యల పరిష్కారంలో తొందరపాటు నిర్ణయాలకు తావులేదని స్పష్టం చేసింది.

23,007 దరఖాస్తులు పెండింగ్‌

జిల్లాలో ఇప్పటివరకు 3,37,439 దరఖాస్తులను పరిష్కరించగా, వివిధ స్థాయిల్లో మరో 23,007 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని యూనియన్‌ తెలిపింది. ఇందులో తహసీల్దార్‌ స్థాయిలో 9,788, ఆర్డీఓ స్థాయిలో 2,801, అదనపు కలెక్టర్‌ స్థాయిలో 8,228, కలెక్టర్‌ స్థాయిలో 2,190 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది.

ఆధారాలతో ఫిర్యాదు చేయండి

కార్యాలయాల్లో అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు నిర్దిష్ట ఆధారాలు ఉంటే సంబంధిత దరఖాస్తు నంబర్లు, భూ రికార్డులు, ఇతర ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకురావాలని సూచించింది. ప్రజావాణి ద్వారా అందే భూ సమస్యల దరఖాస్తులను కూడా ప్రాధాన్యతతో పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రజలు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరింది.