టీఎన్జీవో సభ్యత్వ నమోదులో 55 మంది ఉద్యోగులు
సూర్య మంచిర్యాల టౌన్ : టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో లక్షెట్టిపేట యూనిట్, దండేపల్లి మండలానికి చెందిన సుమారు 55 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సభ్యత్వం తీసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లాలోని ప్రతి యూనిట్‌లో సభ్యత్వ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.సభ్యత్వ నమోదులో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, ఉపాధ్యక్షుడు పూదరి నరేందర్, లక్షెట్టిపేట యూనిట్ అధ్యక్షుడు గొల్ల శ్రీనివాస్, యూనిట్ ఉపాధ్యక్షుడు భూమన్నతో పాటు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.