BREAKING
ఆసుపత్రి బిల్లులపై బీఐఎస్ ప్రమాణాలు తప్పనిసరి చేయాలి.. క్యాప్కో చైర్మన్ జి. సురేష్ కుమార్ డిమాండ్ 15, 16, 17 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. మద్దతు తెలిపిన 20 కుటుంబాలు. కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ రంగం భారీ లక్ష్యం ఎంపీటీసీ,జడ్పీటీసీ 8 నామినేషన్ల తిరస్కరణ పొదలకూరు బిట్-2లో వైసీపీ అభ్యర్థి వాకాటి సంధ్య విస్తృత ప్రచారం భూ రీసర్వే పనులను వేగవంతం చేయాలి మొదటి దశలో ఎంపిక చేసిన 70 రెవెన్యూ గ్రామాల్లో సర్వేకు ప్రాధాన్యత ఇవ్వాలి 52వ డివిజన్ తంగవేలు కాలనీలో యువ కార్పొరేటర్ పీఎస్ చందు ప్రచారం జోరు మేయర్ గా కటారి హేమలతను భారీ మెజారిటీతో గెలిపించండి చేజర్లలో వైసీపీకి భారీ షాక్‌- టీడీపీలోకి భారీ చేరికలు వైసిపి దాడిని ఖండించిన తెలుగుదేశం పార్టీ నేత ధర్మతేజ. భీమవరంలో భారీ దొంగతనాల కేసు 24 గంటల్లో ఛేదన శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లో వరుస చోరీలు.. నిందితుడి అరెస్ట్ రూ.1.08 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం ప్రశాంత వాతావరణంలో ముగిసిన అసిస్టెంట్ సైంటిస్ట్ పరీక్ష స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లకు శిక్షణ శిబిరాలు ఈ నెల 25 నుంచి మునిపల్లి మండలం లింగంపల్లిలో ప్రారంభం దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ‘సంకల్పం’ 100 మందికి పైగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాల కోసం కొలతల సేకరణ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయం: ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ కి షాక్.... నగరం మండలంలో ఒక్క నామినేషన్ తిరస్కరణ - డబుల్ ఎంట్రీలో 6 నామినేషన్లు తొలగింపు

అంతర్జాతీయ పరిశోధనలకు ఎంతో దోహదం -ఎస్వీయూలో అత్యాధునిక పరిశోధనా పరికరాలు ప్రారంభం : ఆప్సి చైర్మన్, విసి

Select Suryaa Now
అంతర్జాతీయ పరిశోధనలకు ఎంతో దోహదం  -ఎస్వీయూలో అత్యాధునిక పరిశోధనా పరికరాలు ప్రారంభం : ఆప్సి చైర్మన్, విసి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూ భౌతిక శాస్త్ర విభాగంలో రూసా నిధులతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎస్ఈఎస్ఈఎ, ఈడీఎస్ పరిశోధనా పరికరాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయభాస్కరరావు, వీసీ ప్రొఫెసర్ టాటా నర్సింగరావుతో కలసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నూతన పరికరాలను వారు పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఆధునిక పరిశోధనా పరికరం అందుబాటులోకి రావడంతో విశ్వవిద్యాలయంలో పరిశోధనలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ప్రొఫెసర్ దేవప్రసాద్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆప్సి చైర్మన్ ప్రొఫెసర్ విజయ భాస్కర రావు మట్లాడుతూ ఫీల్డ్ ఎమిషన్ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ విత్ ఎనర్జీ డిస్పర్సివ్ ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ ద్వారా వివిధ పదార్థాల సూక్ష్మ నిర్మాణం, ఉపరితల స్వరూపం, కణాల పరిమాణం, ఆకృతి, మూలక కూర్పును అత్యంత సూక్ష్మ స్థాయిలో విశ్లేషించవచ్చని తెలిపారు. ఈ పరికరాలను సహాయంతో నమూనాల్లోని వివిధ మూలకాలను గుర్తించడంతోపాటు వాటి కూర్పును విశ్లేషించవచ్చని చెప్పారు. నానో పదార్థాలు, మెటీరియల్స్ సైన్స్, అధునాతన ఫంక్షనల్ మెటీరియల్స్, సెమీకండక్టర్లు, ఫాస్ఫర్లు, ఫోటోకాటలిసిస్, శక్తి సంబంధిత పదార్థాల పరిశోధనలకు ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పరిశోధనల్లో కచ్చితత్వం, నాణ్యత, విశ్వసనీయతను పెంపొందించడంతోపాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పరిశోధనలు నిర్వహించేందుకు ఇవి దోహదపడతాయని విసి టాటా నరసింగరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ చెండ్రాయుడు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భూపతి నాయుడు, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మావతి, భౌతిక శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ దేవప్రసాదరాజు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్