21 వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ ప్రచారం జోరు
వార్డు ప్రజలు అండగా నిలిచి తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే.. 21వ వార్డును ఆదర్శవం తమైన వార్డుగా అభివృద్ధి చేస్తానని 21వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నాయపు రాజశేఖర్ తెలిపారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం వార్డు పరిధిలో మూడోరోజు పెద్ద ఎత్తున ప్రచారంను కొనసాగించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను కౌన్సిలర్ గాను, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అర్షియా భానును గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆశీస్సులతో కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నానని.. ఎమ్మెల్యే పట్టణ అభివృద్ధికి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ఆదర్శంగా తీసుకొని 21వ వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలియజేశారు. ప్రజా సమస్యలే పరిష్కారమే లక్ష్యంగా పనిచేయ నున్నట్లు వివరిం చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఉన్నారు.