BREAKING
చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాల పరిశీలన...... కొలగాని సత్రం ప్రాంత నివాసుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటా - మంత్రి ఆనం హామీ కూటమితో ప్రజలకు సుపరిపాలన వైసీపీ 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కృపాకర్ రెడ్డి ఇంటింటా ప్రచార కార్యక్రమం భారీ శతకంతో చరిత్ర సృష్టించిన నమీబియా కెప్టెన్: అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డుల మోత రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో పీఎం రాహత్ పథకం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. బాలసదన్‌లో విద్యార్ధులకు ఫౌష్టికాహారం పంపిణీ ఆత్మకూరునియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ప్రత్యేక కృషి - పార్టీ బలోపేతం సంకల్పం ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లిన స్టార్ షట్లర్ పీవీ సింధు కూటమి అభ్యర్థి బమ్మిడి ఈశ్వరరావు గెలుపు ఖాయం: జనసేన నేత వంజరాపు సింహాచలం ధీమా *మద్దికుంటలో ఘనంగా దేవి నవరాత్రుల నిమజ్జనోత్సవం* ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన దివంగత మాజీ కార్పొరేటర్ చెరుకూరి వసంత్ కుమార్ జ్ఞాపకార్థం - ఎమ్మెల్యే సతీమణి కంచర్ల ప్రతిమ, మేయర్ అభ్యర్థి కటారి హేమలత పాల్గొని ప్రజలకు అన్నదానం విధులకు డుమ్మా.. 54 మంది లైసెన్స్‌ సర్వేయర్ల సేవలు రద్దు నీటిని వృధా చేయకండి భవిష్యత్తును కాపాడండి: నరేష్ యాదవ్

పి.ఎం. రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స - రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

Select Suryaa Now
పి.ఎం. రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స -  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : పి.ఎం. రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు 1 లక్ష 50 వేల రూపాయల వరకు ఉచిత చికిత్స అందించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రహదారి ప్రమాదాలలో గాయపడిన బాధితులకు సత్వర వైద్య సహాయం అందించి, ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పి.ఎం. రహత్ పథకాన్ని అమలు చేస్తుందని, ఈ పథకం క్రింద పోలీసుల ఆమోదం పొందిన కేసులలో అర్హులైన రహదారి ప్రమాద బాధితులకు గరిష్ఠంగా 1 లక్ష 50 వేల రూపాయల వరకు ఉచిత చికిత్స అందించేందుకు అవకాశం ఉందని తెలిపారు. ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్ఠంగా 7 రోజుల వ్యవధికి సంబంధించిన చికిత్సా సదుపాయం ఉంటుందని, రోడ్డు ప్రమాద వివరాలను నిర్ధారించేందుకు జిల్లా పోలీసులకు 24 గంటల గడువు ఉంటుందని, ట్రాన్సాక్షన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ 2.0, ఎలక్ట్రానిక్ డిటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ ద్వారా బాధితుల వివరాలు, ప్రమాద వివరాలు, కేసు స్థితిని అనుసంధానించడం జరుగుతుందని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో మాట్లాడుతూ పి.ఎం. రహత్ పథకం అమలు విధానంపై సంబంధిత డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సమగ్ర శిక్షణ అందించాలని అధికారులను ఆదేశించారు. పథకానికి సంబంధించిన విధివిధానాలు, బాధితుల వివరాల నమోదు, సంబంధిత శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. జిల్లాలో పథకం అమలులో ఎలాంటి లోపాలు లేకుండా, నిర్దేశించిన విధానాలను ఖచ్చితంగా పాటిస్తూ పి.ఎం. రహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్, జిల్లా రవాణా అధికారి, ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ సత్యనారాయణ, జైపూర్ ఎ.సి.పి. వెంకటేశ్వర్లు, ఈ డి ఎ ఆర్ జిల్లా మేనేజర్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులుపాల్గొన్నారు.