చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాల పరిశీలన......
మద్దూర్ l..…మండలంలోని బైరాన్ పల్లి గ్రామంలో చారిత్రక కట్టడాలు పురాతన దేవాలయాలను హెరిటేజ్ తెలంగాణ సంచాలకులు ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి శనివారం గ్రామ సర్పంచ్ బర్మ రాజమల్లయ్యతో కలిసి పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఉన్న అంగడి వీరన్న గుడి పరిరక్షణ బురుజు పునరుద్ధరణ కు తక్షణమే అంచనాలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. గ్రామంలో ఉన్న చారిత్రక పురావస్తు సాంస్కృతిక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామంలోని పురాతన దేవాలయాలు చారిత్రక కట్టడాలు పరిరక్షించడంతో పాటు గ్రామాన్ని ప్రముఖ చారిత్రక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు హెరిటేజ్ తెలంగాణ శాఖ సంచాలకులు ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసంచాలకులు పి నాగరాజు, సహాయ సంచాలకులు, సూపర్ ఇండియన్ ఏ రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.