కొలగాని సత్రం ప్రాంత నివాసుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటా - మంత్రి ఆనం హామీ
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణంలోని కొలగాని రామయ్య ధర్మసత్రం ప్రాంతంలోని చింత చెట్ల కాలనీలో నివాసం ఉంటున్న పేద వర్గాల వారు నివాస స్థలాల సమస్యల విషయమై తగు చర్యలు తీసుకుంటానని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. అందరూ కరతాళధ్యనులతో హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారుm దాదాపు 40 సంవత్సరాలుగా అనేక పేద వర్గాల కు చెందిన 70 కుటుంబాల వారు అక్కడ చిన్నపాటి ఇళ్లు నిర్మించుకొని నివాసాలు ఉంటున్నారు. అయితే వారి ఇంటి స్థలాలకు ఎవరు పట్టాలివ్వలేదుm ఇప్పటివరకు ఎంతమందికి విన్నవించిన ఎవరు స్పందించలేదు.వారి సమస్యలను తెలుసుకునేందుకు శనివారం సాయంత్రం కాలనీకి విచ్చేసిన మంత్రి రామనారాయణ రెడ్డికి కాలనీవాసులు తాము అనాదిగా ఇక్కడ నివాసాలు ఉంటున్న నిరుపేదలమని, కూలీ నాలీ పనులతో జీవనం సాగించుకుంటూ ఇక్కడ తలదాచుకుంటున్నామని, తమకు నివాసాలు ఉంటున్న చోటా ఇంటి స్థలాలను పట్టాలుగా ఇవ్వాలని వారు రామనారాయణరెడ్డిని కోరారు.ఈ స్థలం ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నందున నియమ నిబంధనలు అనుసరించి తగిన న్యాయం చేస్తానని, ఎన్నికల అనంతరం అధికారులతో చర్చించి కాలనీవాసులకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకుంటానని మంత్రి రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు.వారంతా హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ మంత్రి రామనారాయణరెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఆయనకు తమ సంపూర్ణ మద్దతిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం కుమార్తె ఆనం కైవల్యారెడ్డి, సీనియర్ తెలుగుదేశం నాయకుడు తాళ్లూరు గిరినాయుడు, పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, సీనియర్ తెలుగుదేశం నాయకుడు చల్లా రవికుమార్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు దాసరి మధుసూదన్ రావు, పొడమేకల పెంచలయ్యయాదవ్,14వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి పచ్చిపాల హరిత, ఆరో వార్డు తెలుగుదేశం కౌన్సిలర్ అభ్యర్థి షేక్ నాయబ్ రసూల్ (చిన్న), పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కాలనీవాసులు పాల్గొన్నారు.