ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో నిర్వహించాలి
పాలకొండ, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికలలో ఎటువంటి అవాంచనీయ ఘటనలకు తావులేకుండా పటిష్టమైన నిఘా, కట్టుదిట్టమైన ప్రణాళికతో కూడిన బందోబస్తు ఏర్పాటు చేయడమైందని విశాఖపట్నం రేంజ్ ఐ జి గోపినాద్ జెట్టి అన్నారు. శనివారం డిఎస్పీ కార్యాలయం లో వార్షిక తనిఖీ మరియు సమీక్ష సమావేశం లో ఆయన పాల్గొన్నారు.
నామినేషన్ కేంద్రం పరిసరాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు సూచించారు. కేంద్రం వద్ద ఎలాంటి గందరగోళం, తోపులాటలు లేదా ఘర్షణలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే చర్యలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలపై నిఘా ఉంటుందని కావున ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, డిఎస్పీ రాంబాబు, సిఐ ప్రసాదరావు, ఎస్సై వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : రమణ మూర్తి నాయుడు, పాలకొండ, పార్వతీపురం మన్యం.