జనసేన పార్టీలో విభేదాలు లేవు.. అరకు పార్లమెంట్ అబ్జర్వర్ నల్లం శ్రీనివాస్
సాలూరు, సూర్య : జనసేన పార్టీ గురించి గత వారం రోజులనుండి సాలూరు పట్టణంలో దుష్ప్రచారం జరుగుతుందన్న విషయంలో వాస్తవం లేదని ఆ పార్టీ అరకు పార్లమెంట్ అబ్జర్వర్ నల్ల శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ నాయకులు జర్జాపు సూరిబాబు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ,సాలూరు మున్సిపల్ ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున చైర్పర్సన్ అభ్యర్థిగా గొర్లె విజయ కుమారి పోటీ చేస్తున్న నేపథ్యంలో మా పార్టీలో ఎటువంటి విభేదాలు లేకుండా జనసేన నాయకులు, కార్యకర్తలు మా పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి గొర్లె విజయ్ కుమారి తో పాటు మిగిలిన వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు.
జనసేన పార్టీ అధినేత పవణ్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జన సైనుకులంతా కలిసి కట్టుగా పనిచేసి సాలూరు, పాలకొండ మున్సిపాలిటీలో చైర్ పర్సన్ అభ్యర్థులను గెలిపించి మా అధినేతకు కానుకగా ఇస్తామన్నారు . అలాగే సాలూరు మున్సిపాలిటీలో 9 మంది వార్డు కౌన్సిలర్లుగా బరిలో ఉన్నారన్నారు. వారందరిని గెలిపించే బాధ్యత మా జన సైనికుల భుజాల మీద ఉందన్నారు. ప్రచారంలో ప్రతి ఇంటికి వెళ్లి జనసేన చైర్ పర్సన్ అభ్యర్థి గొర్లె విజయ్ కుమారిని గెలిపించడంతోపాటు, కూటమి ధర్మాన్ని పాటిస్తూ తెలుగుదేశం వార్డు కౌన్సిలర్లను కూడా గెలిపించాలని ప్రచారం చేస్తున్నామన్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ కూటమి ధర్మాన్ని జనసేన నాయకులతో పాటుగా కార్యకర్తలు పాటిస్తున్నారే తప్ప తెలుగుదేశం నాయకులు కూటమి ధర్మాన్ని పాటించడం లేదన్న విమర్శలు సాలూరులో వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జర్జాపు ఈశ్వరరావు, జర్జాపు సూరిబాబు, రాపాక మాధవరావు, నియోజకవర్గ ఇన్చార్జి శివ, జిటి నాయుడు, నవీన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : పిల్లి సతీష్ కుమార్, సీతనగరం, పార్వతీపురం మన్యం.