ఇంకొల్లు మండలంలో 67 నామినేషన్లు ఆమోదం
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :ఇంకొల్లు మండలంలో గత మూడు రోజులుగా జరిగిన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 77 మంది అభ్యర్థులు 14 ఎం.పి.టి.సి స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం పరిశీలనలో భాగంగా 10 తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 67 నామినేషన్లను అధికారుల బృందం ఆమోదించింది. ఆమోదించిన వాటిలో వై.సీ.పీ తరపున 31, తెలుగుదేశం పార్టీ తరుపున 29, జనసేన పార్టీ తరపున 6, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు రంగంలో ఉన్నారు. తిరస్కరణకు గురైన వారు ఎవరైనా అప్పీలుకు వెళ్ళేటట్లయితే ఆర్.డి.ఓ గారి పరిధిలో ఉంటుందన్నారు. ఈనెల 27వ తేదీ సాయంత్రం 3 గంటలలోపు ఉపసంహరణకు గడువును ప్రకటిస్తున్నట్లు ఎన్నికల అధికారి కె. రమేష్‌బాబు ప్రకటించారు. తదుపరి అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామని వివరించారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి గట్టా శ్రీనివాసరావు, తహశీల్థారు ఏ.వి.ఎస్ శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.