BREAKING
ఆత్మకూరునియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ప్రత్యేక కృషి - పార్టీ బలోపేతం సంకల్పం ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లిన స్టార్ షట్లర్ పీవీ సింధు కూటమి అభ్యర్థి బమ్మిడి ఈశ్వరరావు గెలుపు ఖాయం: జనసేన నేత వంజరాపు సింహాచలం ధీమా *మద్దికుంటలో ఘనంగా దేవి నవరాత్రుల నిమజ్జనోత్సవం* ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన దివంగత మాజీ కార్పొరేటర్ చెరుకూరి వసంత్ కుమార్ జ్ఞాపకార్థం - ఎమ్మెల్యే సతీమణి కంచర్ల ప్రతిమ, మేయర్ అభ్యర్థి కటారి హేమలత పాల్గొని ప్రజలకు అన్నదానం విధులకు డుమ్మా.. 54 మంది లైసెన్స్‌ సర్వేయర్ల సేవలు రద్దు నీటిని వృధా చేయకండి భవిష్యత్తును కాపాడండి: నరేష్ యాదవ్ 13 ఎంపీటీసీ స్థానాలకు 73 నామినేషన్లు సీఈఐఆర్ పోర్టల్‌తో ఆరు మొబైల్ ఫోన్ల గుర్తింపు వారిద్దరూ అద్భుతం.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించారు: శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు నీటిని పొదుపుగా వాడుకోవాలి వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రతి నల్లాకు ట్యాప్‌ బిగింపు జెడ్పీటీసీ కూటమి అభ్యర్ధి పోలాకి చంద్ర శేఖర్ (కింగ్) వాళ్లలో ఒక్కరిని అవుట్ చేసినా మ్యాచ్ గెలిచేవాళ్లం: న్యూజిలాండ్ కెప్టెన్ ఆవేదన మల్లారెడ్డిపల్లిలో పశువుల చోరీ

అయోడిన్ పై విద్యార్థులకు అవగాహన

Select Suryaa Now
అయోడిన్ పై విద్యార్థులకు అవగాహన

ఆత్మకూర్, మేజర్ న్యూస్ : అయోడిన్ పై ప్రతి ఒక్కరు ఆగాహన కలిగి ఉండి ప్రతిరోజు అయోడిన్ కలిగిన ఉప్పును తగిన మోతాదులో తీసుకోవాలని ఆర్ బిఎస్ కే నోడల్ అధికారి అనిల్ కుమార్ రెడ్డి, బైర్లుటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ హర్ష లు అన్నారు. శనివారం బైర్లుట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను డాక్టర్ హర్ష తో కలిసి అనిల్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోడిన్ లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, శరీర ఎదుగుదల లో అయోడిన్ ప్రాముఖ్యత, మెదడు అభివృద్ధి, మానసిక వికాసంలో అయోడిన్ ప్రాముఖ్యతపై విద్యార్థులతో పాటు ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా అయోడిన్ కలిగిన ఉప్పును తగిన మోతాదులో ఉపయోగించాలన్నారు. దీనివల్ల ఐడెం లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వివరించారు. అయోడిన్ లోపం వల్ల పిల్లలలో శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. తప్పనిసరిగా ఐడి తో కూడిన ఉప్పును వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ కుద్దూస్ భాష, పి హెచ్ ఎన్ భ్రమరాంబ, రవణమ్మ, ఎమ్మెల్ హెచ్ పి దీపిక, హెల్తి సోమేశ్వరి, రామ గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు.