అప్రమత్తంగా ఉండాలి
పాలకొండ, సూర్య : తుఫాన్ కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ రాధాకృష్ణమూర్తి కోరారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు అందించారు 27,28, 29 తేదీల్లో వర్షాలు విపరీతంగా కురిసే అవకాశం ఉందని ప్రజలు అవసరమైతే బయటకు రావాలని లేకుంటే ఇళ్లలోనే ఉండాల అన్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు నాగావళి నది దగ్గరకు ఎవరు వెళ్లొద్దన్నారు. వీఆర్వోలు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉండాలన్నారు తాసిల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా పాడుబడిన పాత ఇళ్లల్లో ఎవరు నివసించవద్దన్నారు. వారందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు అని శాఖ అధికారులు కూడా అందుబాటులో ఉండే చర్యలు తీసుకోవాలన్నారు.
రిపోర్టర్ : రమణ మూర్తి నాయుడు, పాలకొండ, పార్వతీపురం మన్యం.