BREAKING
వేములపల్లికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు ఆసుపత్రి బిల్లులపై బీఐఎస్ ప్రమాణాలు తప్పనిసరి చేయాలి.. క్యాప్కో చైర్మన్ జి. సురేష్ కుమార్ డిమాండ్ 15, 16, 17 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. మద్దతు తెలిపిన 20 కుటుంబాలు. కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ రంగం భారీ లక్ష్యం ఎంపీటీసీ,జడ్పీటీసీ 8 నామినేషన్ల తిరస్కరణ పొదలకూరు బిట్-2లో వైసీపీ అభ్యర్థి వాకాటి సంధ్య విస్తృత ప్రచారం భూ రీసర్వే పనులను వేగవంతం చేయాలి మొదటి దశలో ఎంపిక చేసిన 70 రెవెన్యూ గ్రామాల్లో సర్వేకు ప్రాధాన్యత ఇవ్వాలి 52వ డివిజన్ తంగవేలు కాలనీలో యువ కార్పొరేటర్ పీఎస్ చందు ప్రచారం జోరు మేయర్ గా కటారి హేమలతను భారీ మెజారిటీతో గెలిపించండి చేజర్లలో వైసీపీకి భారీ షాక్‌- టీడీపీలోకి భారీ చేరికలు వైసిపి దాడిని ఖండించిన తెలుగుదేశం పార్టీ నేత ధర్మతేజ. భీమవరంలో భారీ దొంగతనాల కేసు 24 గంటల్లో ఛేదన శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లో వరుస చోరీలు.. నిందితుడి అరెస్ట్ రూ.1.08 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం ప్రశాంత వాతావరణంలో ముగిసిన అసిస్టెంట్ సైంటిస్ట్ పరీక్ష స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లకు శిక్షణ శిబిరాలు ఈ నెల 25 నుంచి మునిపల్లి మండలం లింగంపల్లిలో ప్రారంభం దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ‘సంకల్పం’ 100 మందికి పైగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాల కోసం కొలతల సేకరణ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయం: ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ కి షాక్....

తూప్రాన్ ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు త్వరగా పరిహారం అందించాలి

Select Suryaa Now
తూప్రాన్ ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు త్వరగా పరిహారం అందించాలి

తూప్రాన్;మెదక్‌ జిల్లా తూప్రాన్‌ సబ్‌ డివిజన్‌ పోలీస్‌ కార్యాలయాన్ని మల్టీ జోన్‌–1 ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్‌ ఐజీకి మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఐజీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, కార్యాలయ ప్రాంగణంలో అరుదైన మియాజాకి రకానికి చెందిన మామిడి మొక్కను నాటారు.అనంతరం కార్యాలయ రికార్డులు, క్రైమ్‌ రిజిస్టర్లు, పెండింగ్‌, దర్యాప్తు, ట్రయల్‌ దశలో ఉన్న కేసుల వివరాలను సమీక్షించారు. గ్రేవ్‌, పోక్సో కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి కేసులో నిర్దేశిత ఎస్‌ఓపీని పాటించాలని అధికారులను ఆదేశించారు.ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు త్వరితగతిన పరిహారం అందేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఐసీజేఎస్‌ (ICJS) వ్యవస్థ పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని, ఈ-సాక్ష్య (e-Sakshya), ఆన్‌సైట్‌ ఎఫ్‌ఐఆర్‌ విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని, నిర్ణీత గడువులోగా ఛార్జ్‌షీట్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు.దొంగతనాల నివారణకు రాత్రి గస్తీ, వాహన తనిఖీలు ముమ్మరం చేసి, అనుమానితులపై నిఘా ఉంచాలని ఆదేశించారు.కార్యాలయాల్లో 5ఎస్‌ విధానాన్ని అమలు చేస్తూ రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించాలని, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని, సైబర్‌ నేరాలు, ట్రాఫిక్‌ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని సూచించారు.ఈ  తనిఖీలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్, తూప్రాన్ డియస్పి నరేందర్ గౌడ్, సీఐ లు సైదా, వెంకట రాజా గౌడ్, ఎసై లు శివానందం, సుభాష్ గౌడ్,  యాదగిరి, గంగరాజు, మండలాల ఎస్ఐలు సిబ్బంది తదితరులు ఉన్నారు.