కంబలపల్లి పైలెట్ గ్రామంగా ఎంపిక ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపన
సదాశివపేట; సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని కంబాలపల్లి గ్రామాన్ని పైలెట్ గ్రామంగా ఎంపిక చేశారు. సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి చొరవతో గ్రామ సర్పంచ్ ఇందూరి భారతమ్మ బాబు ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో అంజనీ దేవి, ఎంపీఓ నారాయణ, ఏపీఓ గీతాదేవి, టెక్నికల్ అసిస్టెంట్ మంజుల హాజరయ్యారు. గ్రామంలో భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి స్వరూప, ఉపసర్పంచ్ కుమ్మరి పార్వతమ్మ, ఆంజనేయులు, వార్డు సభ్యులు పసుల ప్రభు, ఎస్‌డీ అఫ్రిన్ బేగం, మునీర్, ఫీల్డ్ అసిస్టెంట్ నరేందర్, మాజీ వార్డు సభ్యులు కుమ్మరి సుశీల, కుమ్మరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.