telangana
భైరాపూర్ చెరువులో మునిగి వ్యక్తి మృతి
సూర్య. బీర్కూర్ : బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లెల శ్యామ్ స/o పోచయ్య శనివారం ఉదయం ప్రమాదవశాత్తు చెరువులో కాలు జారి నీటిలో మునిగి మృతి చెందాడు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం శ్యామ్ ఉదయం బట్టలు ఉతికేందుకు భైరాపూర్ గ్రామ చెరువు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయి నీటిలో మునిగిపోయాడు. కొంతసేపటి తర్వాత అతను నీటిలో మునిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.ఈ ఘటనపై మృతుడి భార్య వినోద నుంచి ఫిర్యాదు స్వీకరించి ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు బీర్కూర్ ఎస్‌ఐ రాములు తెలిపారు.