telangana
గూడూరులో అంగరంగ వైభవంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి కల్యాణోత్సవం
దోమ, మేజర్ న్యూస్: దోమ మండల పరిధిలోని గూడూరు గ్రామంలో శ్రీ వీరభద్ర సమేత భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి కల్యాణ మహోత్సవం భక్తుల కోలాహలం, మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు శివశ్రీ శివానంద గురుస్వామి ఆధ్వర్యంలో స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల దివ్య కల్యాణాన్ని కనులపండువగా జరిపించారు. ఈ వేడుకకు వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీజేపీ నాయకుడు డాక్టర్ వెన్నె ఈశ్వరప్ప మాట్లాడుతూ.... పార్వతీ పరమేశ్వరుల కల్యాణం ఎంతో కమనీయంగా, కన్నుల పండువగా జరిగిందన్నారు. ఈ దివ్య కల్యాణోత్సవంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా, అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ యాదవరెడ్డి, నార్మక్ మదర్ డైరీ డైరెక్టర్ నరసింహారెడ్డి, స్థానిక సర్పంచ్ ఉషారాణి మధు, ఉప సర్పంచ్ బంటు బాల్‌రాజ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు అగిరాల వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి జి. కిష్టారెడ్డి, ఉప కార్యదర్శి ఎ. నరేందర్‌రెడ్డి, కమిటీ కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల ప్రతినిధులు, మహిళలు, వివిధ గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: చాపల బద్రి, దోమ, వికారాబాద్ జిల్లా.