BREAKING
బాలసదన్‌లో విద్యార్ధులకు ఫౌష్టికాహారం పంపిణీ ఆత్మకూరునియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ప్రత్యేక కృషి - పార్టీ బలోపేతం సంకల్పం ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లిన స్టార్ షట్లర్ పీవీ సింధు కూటమి అభ్యర్థి బమ్మిడి ఈశ్వరరావు గెలుపు ఖాయం: జనసేన నేత వంజరాపు సింహాచలం ధీమా *మద్దికుంటలో ఘనంగా దేవి నవరాత్రుల నిమజ్జనోత్సవం* ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన దివంగత మాజీ కార్పొరేటర్ చెరుకూరి వసంత్ కుమార్ జ్ఞాపకార్థం - ఎమ్మెల్యే సతీమణి కంచర్ల ప్రతిమ, మేయర్ అభ్యర్థి కటారి హేమలత పాల్గొని ప్రజలకు అన్నదానం విధులకు డుమ్మా.. 54 మంది లైసెన్స్‌ సర్వేయర్ల సేవలు రద్దు నీటిని వృధా చేయకండి భవిష్యత్తును కాపాడండి: నరేష్ యాదవ్ 13 ఎంపీటీసీ స్థానాలకు 73 నామినేషన్లు సీఈఐఆర్ పోర్టల్‌తో ఆరు మొబైల్ ఫోన్ల గుర్తింపు వారిద్దరూ అద్భుతం.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించారు: శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు నీటిని పొదుపుగా వాడుకోవాలి వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రతి నల్లాకు ట్యాప్‌ బిగింపు జెడ్పీటీసీ కూటమి అభ్యర్ధి పోలాకి చంద్ర శేఖర్ (కింగ్) వాళ్లలో ఒక్కరిని అవుట్ చేసినా మ్యాచ్ గెలిచేవాళ్లం: న్యూజిలాండ్ కెప్టెన్ ఆవేదన

మోమిన్‌పేట్ రైతు వేదికలో ఎల్‌నినో ప్రభావంపై సమీక్ష.. వీక్షించిన రైతులు

Select Suryaa Now
మోమిన్‌పేట్ రైతు వేదికలో ఎల్‌నినో ప్రభావంపై సమీక్ష.. వీక్షించిన రైతులు
మోమిన్‌పేట్, మేజర్ న్యూస్:ఎల్‌నినో ప్రభావంతో మారనున్న వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ రంగంపై వాటి ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన సమీక్ష సమావేశాన్ని మోమిన్‌పేట్ రైతు వేదికలో రైతులు వీక్షించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎల్‌నినో ప్రభావ పరిస్థితులు, వర్షపాతంలో మార్పులు, పంటల సాగుపై వాటి ప్రభావం తదితర అంశాలపై చర్చించారు.వాతావరణ పరిస్థితుల్లో మార్పుల నేపథ్యంలో రైతులు ముందస్తు వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవడం, పంటలను కాపాడుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు పాటించడం వంటి అంశాలపై సమావేశంలో దృష్టి సారించారు. వర్షపాతంలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులను అనుసరించాలని సూచించారు.వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండటం ద్వారా పంటల సాగులో ఎదురయ్యే సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వ స్థాయిలో నిర్వహించే సమీక్ష సమావేశాల ద్వారా అందే సమాచారాన్ని రైతులకు చేరవేయడం వ్యవసాయ రంగానికి ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
మోమిన్‌పేట్ రైతు వేదికలో నిర్వహించిన ఈ వీక్షణ కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వై. మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్ యాదవ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కోస్గి సురేందర్, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
 
రిపోర్టర్: వడ్ల మాణిక్యం చారి, మోమిన్ పేట్, వికారాబాద్ జిల్లా.