BREAKING
రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో పీఎం రాహత్ పథకం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. బాలసదన్‌లో విద్యార్ధులకు ఫౌష్టికాహారం పంపిణీ ఆత్మకూరునియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ప్రత్యేక కృషి - పార్టీ బలోపేతం సంకల్పం ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లిన స్టార్ షట్లర్ పీవీ సింధు కూటమి అభ్యర్థి బమ్మిడి ఈశ్వరరావు గెలుపు ఖాయం: జనసేన నేత వంజరాపు సింహాచలం ధీమా *మద్దికుంటలో ఘనంగా దేవి నవరాత్రుల నిమజ్జనోత్సవం* ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన దివంగత మాజీ కార్పొరేటర్ చెరుకూరి వసంత్ కుమార్ జ్ఞాపకార్థం - ఎమ్మెల్యే సతీమణి కంచర్ల ప్రతిమ, మేయర్ అభ్యర్థి కటారి హేమలత పాల్గొని ప్రజలకు అన్నదానం విధులకు డుమ్మా.. 54 మంది లైసెన్స్‌ సర్వేయర్ల సేవలు రద్దు నీటిని వృధా చేయకండి భవిష్యత్తును కాపాడండి: నరేష్ యాదవ్ 13 ఎంపీటీసీ స్థానాలకు 73 నామినేషన్లు సీఈఐఆర్ పోర్టల్‌తో ఆరు మొబైల్ ఫోన్ల గుర్తింపు వారిద్దరూ అద్భుతం.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించారు: శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు నీటిని పొదుపుగా వాడుకోవాలి వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రతి నల్లాకు ట్యాప్‌ బిగింపు జెడ్పీటీసీ కూటమి అభ్యర్ధి పోలాకి చంద్ర శేఖర్ (కింగ్)

పిఓ,ఏపిఓలు ఎన్నికల నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలి

Select Suryaa Now
పిఓ,ఏపిఓలు ఎన్నికల నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలి

గరుగుబిల్లి, సూర్య : ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు అందరూ ఎన్నికల నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని మండల ఎన్నికల అధికారి ఎం వాణిశైలజ అన్నారు. మండల పరిషత్తు అభివృద్ధి కార్యాల యం ఆవరణలో శనివారం ఎంపీటీసీ మరియు జడ్పిటిసి ఎన్నికలు - 2026 కు సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణా కార్యక్రమంను నిర్వహించారు.ఈశిక్షణ కార్యక్రమంలో ఎన్నికల అధికారి ఎం వాణిశైలజ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే పిఓలు,ఏపీఓలు అందరూ ఎన్నికల నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎన్నికల చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ప్రతి దశను నిర్వహించాలన్నారు.ప్రతి దశలో నిర్దేశిత మార్గదర్శకాలను పాటిస్తూ, సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. పోలింగ్ సమయంలో నకిలీ ఓట్లు రాకుండా ఉండేందుకు ఓటరు గుర్తింపు కార్డును పరిశీలించి, ఓటరు వేలికి సరైన మార్కింగ్ వేసి, ఆరిన తర్వాతే పోలింగ్‌కు అనుమతించాలని వివరిం చారు.పోలింగ్ రోజున ఆలస్యంగా రాకుండా ఒక గంట ముందే కేంద్రానికి చేరుకోవడం వల్ల ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా విధులు నిర్వ ర్తించవచ్చని తెలిపారు. అధికారులు తమ సొంత సలహాలు, ఆలోచనలు లేదా వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేకుండా నిబంధనల మేరకే విధులు నిర్వహించాలన్నారు.పోలింగ్ బూత్ మీ చేతిలో ఉంటుందని, పోలింగ్ ప్రారంభమైన సమయం నుండి బాక్స్ సీల్ వేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు అక్కడ జరిగే ప్రతి ఒక్క కార్యకలా పానికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సూచించారు.పోలింగ్ బూత్ పరిధిలో ఉండే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, సహాయకుల సహా యంతో పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూసుకోవాలన్నారు.పీఓ హ్యాండ్‌బుక్‌ లో ఉన్న ప్రతీ పేజీని క్షుణ్ణంగా చదివి, ఏకార్యకలాపాన్ని ఎలా చేయాలో ముందే అవగాహన చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణ అత్యంత బాధ్యతాయుతమైన ప్రక్రియ అని, కావున ప్రతి ఒక్కరూ నిబంధ నలకు లోబడి, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా సహకరించాల న్నారు.ఈకార్యక్రమంలో ఉప ఎన్నికల అధికారులు నడిమింటి సూర్యనారా యణ, పాము బాల, కార్యాలయ ఏవో నాలి అర్జునరావు,బొత్స రవికుమార్, కొట్నాన మురళీమోహన్, ఏగేటి శంక ర్రావు,ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మరియు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.