నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు
కావలి మేజర్ న్యూస్ : కావలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచనల మేరకు శనివారం నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన నామినేషన్ పత్రాల పరిశీలనా (స్క్రూటినీ) కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ నామినేషన్ పత్రాలను అధికారులకు పూర్తిస్థాయిలో సమర్పించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో కావలి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన జెడ్పీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు. అల్లూరు మండలం నుండి బీద రమేష్, కావలి మండలం నుండి వాయిల కృష్ణవేణి, బోగోలు మండలం నుండి కర్తం సురేందర్ రెడ్డి, దగదర్తి మండలం నుండి పైడి సిద్దేశ్వర రావు నామినేషన్ పత్రాలను సమర్పించిన వారిలో ఉన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు.