16 డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించండి... ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా... టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి నాగభూషణం
తిరుపతి మేజర్ న్యూస్:
16వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థిగా తనను గెలిపించండి, డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని 16 డివిజన్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి ఆర్ నాగభూషణం తెలిపారు. శనివారం ఎస్వి నగర్, తదితర ప్రాంతాలలో కార్పొరేటర్ అభ్యర్థి నాగభూషణం గెలుపు కోసం తిరుపతి పార్లమెంటు టిడిపి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి ఆ పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం చేశారు. మీ అందరికీ అందుబాటులో ఉండే నాగభూషణమును గెలిపిస్తే డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తోందని చెప్పారు. ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని, వైసీపీ నాయకుల మాయమాటలు నమ్మవద్దని, అభివృద్ధి లక్ష్యంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాగభూషణమును నవంబర్ ఒకటో తేదీ జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలలో 16 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి నాగభూషణం కు ఓట్లు వేసి వేయించి గెలిపించగలరని ఆశిస్తున్నామన్నారు. అభ్యర్థి నాగభూషణం భర్త, తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ ఆర్ ముని రామయ్య మాట్లాడుతూ తాను టౌన్ బ్యాంకు డైరెక్టర్ 15 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందించానని, వారికి తన వంతు సాయం గా బ్యాంకులో రుణాలు ఇప్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేశానన్నారు. కార్పొరేషన్ ఎన్నికలలో తన సతీమణి నాగభూషణంను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి మీ ఇంటి ఆడపడుచు గా, సహోదరిగా సేవలు అందిస్తారని అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్, జె డబ్ల్యూ విజయ్ కుమార్, ఎం ఆర్ పల్లి రామచంద్ర రెడ్డి, కరుణాకర్ చౌదరి, కందాటి సురేష్ రెడ్డి కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.