BREAKING
ఓటీటీలో ఆకట్టుకుంటున్న తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ 'ఫైట్ మహా': మస్ట్ వాచ్ సస్పెన్స్ మూవీ మోమిన్‌పేట్ రైతు వేదికలో ఎల్‌నినో ప్రభావంపై సమీక్ష.. వీక్షించిన రైతులు టీఎన్జీవో సభ్యత్వ నమోదులో 55 మంది ఉద్యోగులు పి.ఎం. రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స - రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు 21 వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ ప్రచారం జోరు ఇంకొల్లు మండలంలో 67 నామినేషన్లు ఆమోదం సాయిపూర్‌లో ఆంజనేయ స్వామి ఉత్సవం అంగరంగ వైభవం 11వ వార్డు లో జోరుగా ఎన్నికల ప్రచారం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కలను సాకారం చేస్తాం : సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయోడిన్ పై విద్యార్థులకు అవగాహన భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి - రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు పొదలకూరులో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన.. అప్రమత్తంగా ఉండాలి ఎన్.హెచ్.ఏం ఉద్యోగుల 12వ రోజు రిలే దీక్షలకు రిటైర్డు ఉద్యోగ సంఘం నాయకుల మద్దతు సుమ ప్రయాణంపై రాజీవ్ కనకాల భావోద్వేగ వ్యాఖ్యలు: ఆమెకు మేమెప్పుడూ సపోర్ట్ చేయలేదు

భూముల రీ-సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

Select Suryaa Now
భూముల రీ-సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

సిద్దిపేట,  : రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ-సర్వే ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి భూభారతి రీ-సర్వే కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి రీ-సర్వే పురోగతి, క్షేత్రస్థాయిలో చేపడుతున్న పనులు, భూ రికార్డుల పరిశీలన, సర్వే ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై సమీక్షించినట్లు తెలిపారు. రీ-సర్వేను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.

భూ రికార్డుల్లో పారదర్శకతకు ప్రాధాన్యం

భూభారతి రీ-సర్వే పనులను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, భూ రికార్డుల విషయంలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని లోకేష్ కుమార్ స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, సర్వే సమయంలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.గ్రామాల్లో నివసించని భూయజమానులను సంప్రదించడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున వ్యవసాయ శాఖ అధికారుల సహకారం తీసుకోవాలని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రీ, రైతు భరోసా తదితర కార్యక్రమాల ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నందున, వారి సహకారంతో గ్రామాల్లో నివసించని భూయజమానులను గుర్తించి సంప్రదించాలని సూచించారు. అనంతరం రీ-సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

జిల్లాలో 30 గ్రామాల్లో రీ-సర్వే

వీడియో కాన్ఫరెన్స్‌లో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ మండలాల్లో 30 గ్రామాల్లో రీ-సర్వే ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తెలిపారు. ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌ఓపీ) ప్రకారం పనులు చేపడుతున్నామని, ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవని వివరించారు.

గ్రామాల్లో నివసించని భూయజమానులను సంప్రదించేందుకు కొంత సమయం అవసరమవుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి అధికారులు సూచించిన విధంగా సంబంధిత శాఖల సమన్వయంతో రీ-సర్వే ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా కలెక్టర్ కె. హైమావతి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.