BREAKING
కూటమితో ప్రజలకు సుపరిపాలన వైసీపీ 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కృపాకర్ రెడ్డి ఇంటింటా ప్రచార కార్యక్రమం భారీ శతకంతో చరిత్ర సృష్టించిన నమీబియా కెప్టెన్: అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డుల మోత రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో పీఎం రాహత్ పథకం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. బాలసదన్‌లో విద్యార్ధులకు ఫౌష్టికాహారం పంపిణీ ఆత్మకూరునియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ప్రత్యేక కృషి - పార్టీ బలోపేతం సంకల్పం ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లిన స్టార్ షట్లర్ పీవీ సింధు కూటమి అభ్యర్థి బమ్మిడి ఈశ్వరరావు గెలుపు ఖాయం: జనసేన నేత వంజరాపు సింహాచలం ధీమా *మద్దికుంటలో ఘనంగా దేవి నవరాత్రుల నిమజ్జనోత్సవం* ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన దివంగత మాజీ కార్పొరేటర్ చెరుకూరి వసంత్ కుమార్ జ్ఞాపకార్థం - ఎమ్మెల్యే సతీమణి కంచర్ల ప్రతిమ, మేయర్ అభ్యర్థి కటారి హేమలత పాల్గొని ప్రజలకు అన్నదానం విధులకు డుమ్మా.. 54 మంది లైసెన్స్‌ సర్వేయర్ల సేవలు రద్దు నీటిని వృధా చేయకండి భవిష్యత్తును కాపాడండి: నరేష్ యాదవ్ 13 ఎంపీటీసీ స్థానాలకు 73 నామినేషన్లు సీఈఐఆర్ పోర్టల్‌తో ఆరు మొబైల్ ఫోన్ల గుర్తింపు

ఎన్.హెచ్.ఏం ఉద్యోగుల 12వ రోజు రిలే దీక్షలకు రిటైర్డు ఉద్యోగ సంఘం నాయకుల మద్దతు

Select Suryaa Now
ఎన్.హెచ్.ఏం ఉద్యోగుల 12వ రోజు రిలే దీక్షలకు రిటైర్డు ఉద్యోగ సంఘం నాయకుల మద్దతు

*నారాయణపేట, సూర్యన్యూస్* :  న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం టీజీ ఎన్.హెచ్.ఏం జేఏసి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 12వ రోజుకు చేరుకున్నాయి. నారాయణపేట జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద పార్క్ దగ్గర శనివారం జరిగిన ఎన్.హెచ్.ఏం ఉద్యోగుల నిరసన కార్యక్రమానికి జిల్లా, పట్టణ రిటైర్డు ఉద్యోగుల సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రిటైర్డు ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వకీల్ సంతోష్ కుమార్ లు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఎన్.హెచ్.ఏం ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా ఎన్.హెచ్.ఏం ఉద్యోగుల జీవితాల్లో మాత్రం ఆశించిన మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యోగులు నేటికి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాల్లో అభద్రత మధ్య పనిచేయాల్సి వస్తోందన్నారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు తప్పని సరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్.హెచ్.ఏం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంఘీభావం తెలిపిన వారిలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు మనోహర్, తమ్మలి సత్యనారాయణ, భరత్, కే.సత్యనారాయణ, కృష్ణయ్యలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు బిక్షపతి, అధ్యక్షులు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, కోశాధికారి రాఘవేందర్, ఎన్.హెచ్.ఎం యూనియన్ సభ్యులు మోనేష్ చారి, నరసింహరావు సగరి, తిరుపతి, అర్చన, రామస్వామి, మునీర్, హబీబ్, సోహెల్, వినోద్, నరేందర్, విజయ్, కిరీటి, నవశ్రీ, విరోజ, చందన, అనురాధ, సౌందర్య, పుష్ప, సావిత్రమ్మ, దేవిక, సుజాత, శ్వేతశ్రీ, అజారుద్దీన్,  స్నేహలత, మమత పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.