BREAKING
కంబలపల్లి పైలెట్ గ్రామంగా ఎంపిక ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపన భైరాపూర్ చెరువులో మునిగి వ్యక్తి మృతి కెరెల్లి గ్రామంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలు ఓటీటీలో ఆకట్టుకుంటున్న తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ 'ఫైట్ మహా': మస్ట్ వాచ్ సస్పెన్స్ మూవీ మోమిన్‌పేట్ రైతు వేదికలో ఎల్‌నినో ప్రభావంపై సమీక్ష.. వీక్షించిన రైతులు టీఎన్జీవో సభ్యత్వ నమోదులో 55 మంది ఉద్యోగులు పి.ఎం. రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స - రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు 21 వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ ప్రచారం జోరు ఇంకొల్లు మండలంలో 67 నామినేషన్లు ఆమోదం సాయిపూర్‌లో ఆంజనేయ స్వామి ఉత్సవం అంగరంగ వైభవం 11వ వార్డు లో జోరుగా ఎన్నికల ప్రచారం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కలను సాకారం చేస్తాం : సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయోడిన్ పై విద్యార్థులకు అవగాహన భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి - రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు పొదలకూరులో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన..

ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైకాపా ఎస్సీ సెల్ నేత నన్నం జస్టిస్.

Select Suryaa Now
ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైకాపా ఎస్సీ సెల్ నేత నన్నం జస్టిస్.

​కావలి మేజర్ న్యూస్ :   కావలి నియోజకవర్గం ముసునూరుకు చెందిన వైకాపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు నన్నం జస్టిస్ ఆ పార్టీకి రాజీనామా చేసి అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆయనకు ఎమ్మెల్యే పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.   ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాను టీడీపీలో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు.  ​అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రజాసేవ కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ టీడీపీలో సముచిత స్థానం, గుర్తింపు ఉంటాయని పేర్కొన్నారు.  పలువురు స్థానిక టీడీపీ నాయకులు, ముసునూరు గ్రామ ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు.