BREAKING
జోరుగా ఆరు పిక్కల జూదం!. - * ‘సింగిల్ మాది.. డబుల్ మీది’ పేరుతో దందా * అనాథ వృద్ధులకు బాలవికాస అండ 40 మంది వృద్ధులకు నిత్యావసర సరుకులు, సమస్యాత్మక గ్రామాలు గుర్తించి అధికారులు అప్రమత్తంగా ఉండాలి తిరుపతిలో టీడీపీకి తిరుగులేదు జేబీ శ్రీనివాస్‌కు కమ్మ సంఘం మద్దతు 66 డివిజన్లలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం -బండచర్లపల్లి,రావురూకులలో నూతన విద్యార్థి కమిటీల ఏర్పాటు నటి ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్‌’ సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ.. ఒకే వేదికపై 25 రకాల సేవలు! ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు మృత కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండ.. -రూ.20 వేల సాయం! తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తత అవసరం * సూచనలు అందజేసిన మండల ఏవో మెట్ట మోహనరావు * అభివృద్ధి, సంక్షేమమే ప్రచార అస్త్రాలుగా ముందుకు సాగుదాం ... ఏకగ్రీవ ఎన్నిక ధ్రువపత్రం అందుకున్న సురేష్ నాయుడు స్థానిక సంస్థల జోరు.. రెబల్స్ తో పోరు సైకిల్ గుర్తుకే ఓటు వేయండి.. జడ్పిటిసి అభ్యర్థి శిరీష హడ్కో కాలనీలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు ఎన్నికలు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

కూటమి అభ్యర్థుల గెలుపుకై ఎమ్మెల్యే బీవీ విస్తృత ప్రచారం

Select Suryaa Now
కూటమి అభ్యర్థుల గెలుపుకై ఎమ్మెల్యే బీవీ విస్తృత ప్రచారం

కూటమి అభ్యర్థుల గెలుపుకై ఎమ్మెల్యే బీవీ విస్తృత ప్రచారం 
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
ఎమ్మిగనూరు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ వార్డు కౌన్సిలర్ల గెలుపు కోసం స్థానిక ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి శనివారం ఉదయం నుండి విస్తృతంగా ప్రచారం ఆరంభించారు. ఒకటో వార్డు నుండి 13 వార్డుల వరకు ఆయన కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మర ప్రచారం చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధిని వివరిస్తూ మరింత అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లను గెలిపించి తీరాలని కోరారు. ప్రతి వార్డును  అభివృద్ధి చేయడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యం అన్నారు. ఎమ్మిగనూరులో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది బీవీ మార్క్ అభివృద్ధి అని ఇక్కడ ప్రజలు తెలుసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో తాగునీటి కష్టాలు తీర్చేందుకు గాజులదిన్నె ప్రాజెక్టు నుండి 24 గంటల తాగునీరు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి వీధిలో మౌలిక వసతులు కల్పించే లక్ష్యంగా పురపాలన కొనసాగిస్తామని ఓటర్లు ఆశీర్వదించి ప్రతి కౌన్సిలర్ను పొరపాలక సంఘానికి గెలిపించి పంపాలని కోరారు. ఆయన వెంట టిడిపి పట్టణ అధ్యక్షుడు మాచాని మహేష్, చైర్మన్ అభ్యర్థి మాచాని సునీత టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజా శరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూర్ కర్నూలు జిల్లా