BREAKING
కరువు ముప్పు పొంచి ఉన్నా.. కొత్త బోర్లకు అడ్డుకట్టేది ఎవరు? జోరుగా ఆరు పిక్కల జూదం!. - * ‘సింగిల్ మాది.. డబుల్ మీది’ పేరుతో దందా * అనాథ వృద్ధులకు బాలవికాస అండ 40 మంది వృద్ధులకు నిత్యావసర సరుకులు, సమస్యాత్మక గ్రామాలు గుర్తించి అధికారులు అప్రమత్తంగా ఉండాలి తిరుపతిలో టీడీపీకి తిరుగులేదు జేబీ శ్రీనివాస్‌కు కమ్మ సంఘం మద్దతు 66 డివిజన్లలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం -బండచర్లపల్లి,రావురూకులలో నూతన విద్యార్థి కమిటీల ఏర్పాటు నటి ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్‌’ సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ.. ఒకే వేదికపై 25 రకాల సేవలు! ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు మృత కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండ.. -రూ.20 వేల సాయం! తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తత అవసరం * సూచనలు అందజేసిన మండల ఏవో మెట్ట మోహనరావు * అభివృద్ధి, సంక్షేమమే ప్రచార అస్త్రాలుగా ముందుకు సాగుదాం ... ఏకగ్రీవ ఎన్నిక ధ్రువపత్రం అందుకున్న సురేష్ నాయుడు స్థానిక సంస్థల జోరు.. రెబల్స్ తో పోరు సైకిల్ గుర్తుకే ఓటు వేయండి.. జడ్పిటిసి అభ్యర్థి శిరీష హడ్కో కాలనీలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు

హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇస్నాపూర్ చైర్మన్ మోటే సుమలత శ్రీకాంత్ దంపతులు

Select Suryaa Now
హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇస్నాపూర్ చైర్మన్ మోటే సుమలత శ్రీకాంత్ దంపతులు

పటాన్‌చెరు:విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ మోటే సుమలత శ్రీకాంత్ దంపతులు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు.ఈ భేటీలో ఇస్నాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన, స్థానిక అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన పనులపై చర్చించారు. మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల గురించి చైర్మన్ మోటే సుమలత శ్రీకాంత్ హరీష్ రావుకు వివరించారు.ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చైర్మన్ పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు పాలకవర్గం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.ఈ మర్యాదపూర్వక భేటీలో నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు,బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.