ఓటర్లందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు - కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి వై.ఓ నందన్
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఓటర్లందరికి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు అందించాలని కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి వై.ఓ నందన్ అధికారులను ఆదేశించారు. ఆయన ఎన్.ఎం.సీ. అధికారులు, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు,జోనల్ అధికారులు , సూపర్వైజర్లు, బూత్ లెవెల్ అధికారులు,ఇతర సంబంధిత అధికారులతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై శనివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లందరూ తమ ఓటు హక్కు ఎక్కడుందో తెలుసుకుని వినియోగించుకునే విధంగా ఓటర్ స్లిప్పులు ఈనెల 28,29,30 తేదీలలో ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్స్ పంపిణీ చేయాలని ఆదేశించారు. కనుక ప్రతి ఓటరు బి.ఎల్.ఓ దగ్గరికి నుంచి ఓటర్ స్లిప్ తీసుకోవాల్సిందిగా ఒక ప్రకటన ద్వారా కోరారు. పోలింగ్ స్టేషన్లలో అవసరమైన చోట మరమ్మత్తులు, పోలింగ్ నిర్వహణకు అనువుగా అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులతో బ్యాలెట్ పేపర్, పోస్టల్ బ్యాలెట్ పేపర్ల ముద్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల విధులలో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు.