ఎన్ ఎల్ ఎస్ ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా కానాల
వింజమూరు మేజర్ న్యూస్ : నేషనల్ లా స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వింజమూరు మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది కానాల మహేష్ నియామకం చేసినట్లు అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ పి సుందర్ రాజ్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టిన కానాల మహేష్ న్యాయవాది వృత్తిపైన ఉన్న మమకారంతో ఉన్నత చదువులు చదివి హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నేషనల్ లా స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ ను ఎన్నుకోవడం అభినందనీయమని ఈ ప్రాంత వాసులు కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా కానాల మహేష్ మాట్లాడుతూ పి సుందర్ రాజు నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయడం పట్ల కృతజ్ఞుడనని తెలిపారు అలాగే రాష్ట్ర కార్యదర్శిగా మల్లాది గంగ బాబు, రాష్ట్ర కోఆర్డినేటర్గా యోగేశ్వర్ నియమితులయ్యారు. తిరుపతి చిత్తూరు జిల్లాల బాధితులను యోగేష్ కు అప్పగించడం జరిగింది అన్నారు. తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా డేనియల్ జిల్లా కార్యదర్శిగా ప్రకాష్, ఎస్ వి యు అధ్యక్షుడిగా భాగ్య మానేశ్వర్, ఎస్వీయూ కార్యదర్శిగా సుధీర్ణు ను నియమించడం జరిగిందన్నారు. నియమించిన వారిని తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగుతారని ఆయన తెలిపారు. కొత్తగా బాధ్యతలు చేపట్టేవారు తమ పదవులకు అనుగుణంగా సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.