కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : సాధారణ ఎన్నికల ప్రక్రియ నిర్వహణ అమలులో భాగంగా మేయర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎమ్. వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ వై.ఓ నందన్ లు స్థానిక డి.కె మహిళా కళాశాల ప్రాంగణంలో ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్నికల నిర్వహణ, లెక్కింపు ప్రక్రియలు అత్యంత పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. ఏర్పాట్ల పర్యవేక్షణలో నెల్లూరు నగర పాలక సంస్థ యస్.ఈ. రహంతు జానీ, ఇంచార్జ్ సిటీ ప్లానర్ రఘునాధరావు, ఏసీబీ వేణు, సర్వేర్ ఏడుకొండలు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.