లే అవుట్ లను పరిశీలించిన కమిషనర్
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక ఇస్కాన్ సిటీ కావేరీ నగర్ ప్రాంతం, గుడిపల్లి పాడు ప్రాంతంలోని సాయి బృందావనం స్మార్ట్ సిటీలో నూతనంగా నిర్మిస్తున్న లే అవుట్ లను టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాధరావుతో కలిసి శనివారం పరిశీలించారు. లేఅవుట్ ల నిర్మాణాలకు అవసరమైన అనుమతులు, ప్లానులు తదితర పత్రాలను కమిషనర్ తనిఖీ చేసి లే అవుట్ ల నిర్వాహకులకు వివిధ సూచనలు జారీ చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన అనుమతుల మేరకే నిర్మాణాలను చేపట్టాలని, నిబంధనలను ఉల్లంఘించరాదని సూచించారు. అనుమతించిన మేరకు మాత్రమే లేఔట్ ల నిర్మాణాలు జరిగేలా, లే అవుట్ పరిధిలో నిర్దేశించిన అన్ని వసతులు ఏర్పాటు చేసేలా పర్యవేక్షించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.
డివిజన్ల పరిధిలో క్రమం తప్పకుండా డ్రైను కాలువల పూడికతీత, వ్యర్థాల తొలగింపు నిర్వహించేలా పర్యవేక్షించి, రానున్న భారీ వర్షాలకు నీరు రోడ్లపై చేరకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, మెరుగైన పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం టి.పి.బి.ఓ శివ , వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.