హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇంద్రేశం చైర్మన్ ప్రమీల,కౌన్సిలర్ అంతిరెడ్డి
పటాన్‌చెరు:దసరా పండుగ సందర్భంగా ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్ ప్రమీల, కౌన్సిలర్ అంతిరెడ్డి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.పండుగ సందర్భంగా జరిగిన ఈ భేటీలో ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి నేతలు చర్చించారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నామని చైర్మన్ ప్రమీల, కౌన్సిలర్ అంతిరెడ్డి తెలిపారు.ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇంద్రేశం మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.