పాఠశాలలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు
సూర్య బాన్సువాడ రూరల్: బాన్సువాడ మండలంలో ని తిరుమలాపూర్ క్యాంప్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నవంబర్ 14న భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పిల్లల పట్ల నెహ్రూకు ఉన్న ప్రేమాభిమానాలను, బాలల సంక్షేమం, విద్యాభివృద్ధి ప్రాముఖ్యతను ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.అనంతరం విద్యార్థులకు వివిధ ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదభరితమైన పోటీలు నిర్వహించి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి
ప్రధానోపాధ్యాయులు కె. శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం హన్మాండ్లు, రాజేశ్వర్, శంకర్, ఆనంద్ కుమార్, పుష్పలత, జె. పిరియా, మహేష్ కుమార్, కవిత తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.