BREAKING
ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ కె. రాజా రెడ్డి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే దంపతులు కుటుంబానికి పరామర్శ. ఓటర్లందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు - కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి వై.ఓ నందన్ 16 డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించండి... ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా... టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి నాగభూషణం ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ప్రారంభించిన ఎస్పీ ఎన్ ఎల్ ఎస్ ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా కానాల కూటమి అభ్యర్థుల గెలుపుకై ఎమ్మెల్యే బీవీ విస్తృత ప్రచారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇంద్రేశం చైర్మన్ ప్రమీల,కౌన్సిలర్ అంతిరెడ్డి భూముల రీ-సర్వే పకడ్బందీగా నిర్వహించాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైకాపా ఎస్సీ సెల్ నేత నన్నం జస్టిస్. 53వ డివిజన్ ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్న శంకర్ యాదవ్ విక్రమ సింహపురి యూనివర్సిటీ అంతర కళాశాలలో ఆటలపోటీలు నిర్వహించారు. లే అవుట్ లను పరిశీలించిన కమిషనర్ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇస్నాపూర్ చైర్మన్ మోటే సుమలత శ్రీకాంత్ దంపతులు

నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి-కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Select Suryaa Now
నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి-కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

భూపాలపల్లి సూర్యప్రతినిధి, మేజర్ న్యూస్, నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ శిరిశెట్టి సంకీర్త్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్‌ను శనివారం జిల్లా ఎస్పీ సంకీర్త్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్, నిర్వహణ, పరిశుభ్రత, రికార్డులు, వివిధ విభాగాల పనితీరు, సిబ్బంది క్రమశిక్షణ, యూనిఫాం నిర్వహణను పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి విధుల నిర్వహణ, పనితీరు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను తెలుసు కున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల పనితీరును పరిశీలించి, నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, విజిబుల్ పోలీసింగ్, నిఘా పెట్రోలింగ్, కమ్యూనిటీ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనల నియంత్రణతో పాటు రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సిసిటీఎన్ఎస్ 2.0, ఈ-సాక్ష్య, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ దర్యాప్తు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై సిబ్బంది అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ పోలీస్ శాఖపై నమ్మకాన్ని మరింత పెంపొందించాలని పేర్కొన్నారు.
ఈ తనిఖీల్లో సబ్ డివిజన్ డీఎస్పీ సంపత్ రావు, గణపురం సీఐ కర్ణాకర్ రావు, ఎస్ఐ త్రిలోక్నాథ్ , పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్; రవీందర్ గౌడ్, భూపాలపల్లి