మృతుడి కుటుంబానికి జీఎంవై ఫౌండేషన్ ఆర్థిక సాయం
చౌటుప్పల్, మేజర్ న్యూస్ :చౌటుప్పల్ మండలం పెద్దకొండూరులో అనారోగ్యంతో మృతి చెందిన దిండు నరసింహ గౌడ్ కుటుంబానికి స్థానిక సర్పంచ్ గుండెబోయిన శిరీష ఇస్తారి యాదవ్ అండగా నిలిచారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నరసింహ గౌడ్ నిన్న మృతి చెందారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం జీఎంవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.