BREAKING
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళి ని పరిశీలిస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్ విద్యార్థుల పోరాటానికి ప్రకాష్ రాజ్ మద్దతు, సతీమణి భయానికి ఆయన ఇచ్చిన సంచలన సమాధానమిదే! ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించాలి. - ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ప్రశాంతంగా ఓటుకు వినియోగించుకోండి పోలీసులు అండగా ఉంటారు. డిఎస్పీ. ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో బాధితురాలికి రూ.లక్ష LOC మంజూరు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు.. ఆపన్నహస్తం అందించండి రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 11/1! చీరాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్ జన్మభూమిపై మమకారం.. పెద్ద ఉమెంతాల్ అభివృద్ధికి, క్రీడాకారులు, పేద విద్యార్థుల ప్రోత్సాహానికి పెద్దపీట వేసిన పట్నం మహేందర్ రెడ్డి భారత్‌కు తొలి షాక్.. ఒక పరుగుకే అభిషేక్ శర్మ అవుట్! కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్టిఐ సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న. చింతలమానేపల్లిలో ఘనంగా కొమురం భీమ్ వర్ధంతి వేడుకలు ఓటు హక్కును వినియోగించుకొన్న ఎస్ ఆర్ సి చైర్మన్ రాజగోపాల్.

అప్పులు తీర్చినా.. మళ్లీ బకాయి నోటీసులా? బెజ్జుర్ పీఏసీఎస్‌లో ఏం జరుగుతోంది?

Select Suryaa Now
అప్పులు తీర్చినా.. మళ్లీ బకాయి నోటీసులా?  బెజ్జుర్ పీఏసీఎస్‌లో ఏం జరుగుతోంది?

 

• సుమారు 900 మంది రైతులకు నోటీసులు.. విచారణకు డిమాండ్..…

సూర్య బెజ్జుర్  :

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సుమారు 900 మంది రైతులకు రుణ బకాయిలు ఉన్నాయంటూ నోటీసులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో తీసుకున్న రుణాలను పూర్తిగా చెల్లించినప్పటికీ మళ్లీ బకాయిలు చెల్లించాలని నోటీసులు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలు అప్పు లేని రైతుల పేర్లపై కూడా బకాయిలు చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఆర్టీఐ ప్రొటెక్షన్ యాక్ట్ 2005 కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి లింగయ్య స్పందిస్తూ, ప్రజావాణిలో ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ కోరనున్నట్లు తెలిపారు. పీఏసీఎస్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రైతుల వ్యక్తిగత రుణ ఖాతాలు, లోన్ లెడ్జర్లు, చెల్లింపుల రికార్డులను ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని, రైతులకు న్యాయం చేయాలని కోరారు.