BREAKING
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ 'RC17' మూవీ లాంఛనంగా ప్రారంభం: పూజా కార్యక్రమంలో మెగా అభిమానుల సందడి ఓటీటీలోకి వచ్చేసిన 'అనకాపల్లి' సినిమా: సన్ నెక్స్ట్ వేదికగా స్ట్రీమింగ్ డేట్ ఖరారు రానా వినూత్న హారర్ ప్రాజెక్ట్: కంగనా రనౌత్ హీరోయిన్‌గా రవిబాబు దర్శకత్వంలో 'స్కారీ పిక్చర్' ఆర్‌జీవీకి 29.67 కోట్ల లీగల్ నోటీసు: ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ప్రొడక్షన్ హౌస్ సంచలన హెచ్చరిక ఓటు హక్కును వినియోగించుకున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని బెంగళూరులో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని తల్లిదండ్రులకు విద్యాశాఖ అధికారుల పరామర్శ వైసిపి ఆటలు సాగనివ్వం పవిత్రమైన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి ... -- వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ వణుకుతున్న తీర ప్రాంతాలు.. న్యూజిలాండ్ బౌలర్లను చితక్కొడుతున్న ఇషాన్-శ్రేయస్.. 10 ఓవర్లలో భారత్ 111/2 చెన్నై అపోలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాన్సర్ శస్త్ర చికిత్సలు........... డాక్టర్ సెంథిల్ కుమార్ ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి – డీఎస్పీ ప్రభాకర్ 53, వ డివిజన్ సందర్శించిన డాలర్స్. న్యూజిలాండ్‌పై దూకుడుగా ఆడుతున్న భారత్.. 8 ఓవర్లలో 72/2

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో బాధితురాలికి రూ.లక్ష LOC మంజూరు

Select Suryaa Now
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో బాధితురాలికి రూ.లక్ష LOC మంజూరు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబానికి చెందిన మహిళకు వైద్య చికిత్స అందించేందుకు తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ చొరవ తీసుకున్నారు. వికారాబాద్ పట్టణానికి చెందిన పెద్ది మల్లయ్య భార్య పెద్ది రసమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద రూ.లక్ష విలువైన LOC మంజూరు చేయించారు.హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు ఈ ఆర్థిక సహాయం మంజూరైంది. LOC ద్వారా బాధితురాలు ఆసుపత్రిలో చేరి తక్షణ వైద్య చికిత్స పొందేందుకు అవకాశం కల్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ వైద్య సహాయం అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.తమ కుటుంబ సభ్యురాలి వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందేలా చొరవ తీసుకొని రూ.లక్ష LOC మంజూరు చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బాధితురాలు పెద్ది రసమ్మ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.