ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి – డీఎస్పీ ప్రభాకర్
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణ పరిధిలోని ప్రతి పౌరుడు ఎలాంటి భయం, ఆందోళన లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఓటర్లకు ఎవరైనా ఇబ్బందులు కలిగించినా, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు.
అనిల్ కుమార్ యాదవ్