BREAKING
తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలి - కమిషనర్ వై.ఓ నందన్ శ్రీ గురప్ప స్వామికి సోమవారం ప్రత్యేక పూజలు స్థానిక ఎన్నికల్లో వెనకడుగు వేయొద్దు.. కార్యకర్తలకు అండగా నేనున్నా! ​మోహన్ బాబు వర్సిటీలో ‘పరిశోధనా పద్ధతులు, ప్రచురణ నైతికత’ పై జాతీయ వర్క్‌షాప్ ప్రారంభం మోహన్ బాబు విశ్వవిద్యాలయంలోని పరిశోధన, ఆవిష్కరణ విభాగం ఆధ్వర్యంలో, ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సహకారంతో “పరిశోధనా పద్ధతులు, ప్రచురణ నైతికత” అనే అంశంపై మూడు రోజుల జాతీయ స్థాయి వర్క్‌షాప్ సోమవారం ఘనంగా ప్ కుర్ర దర్శకులతో మెగాస్టార్ క్రేజీ లైనప్: మాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ మూర్తి కాంబినేషన్‌లో చిరంజీవి సినిమా! క్లీన్ , ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ఉండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వర్తించాలి భయపెట్టేందుకు వస్తోన్న జీవీ ప్రకాష్, గౌతమ్ మేనన్ ‘13’: ఆసక్తికరంగా సినిమా ఫస్ట్ లుక్! నఫీజ్ భాషాకు కేంద్ర హోంమంత్రి దక్షతా పతకం --జాతీయ స్థాయిలో గుర్తింపు.. --గుంటూరు రేంజ్ నుంచి ఎంపికైన ఏకైక అధికారి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి ప్రజావాణికి 68 దరఖాస్తులు . ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల నిరాహార దీక్ష సామ రామ్మోహన్ రెడ్డి మద్దతు కౌంటింగ్ కేంద్రాలపై జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. పారదర్శకంగా, సమన్వయంతో ఓట్ల లెక్కింపు చేపట్టాలి ఫిర్యాదులను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ నగేష్ భారతీయ యానిమేషన్ ప్రపంచంలో సంచలనం: 18 నెలల్లో బిలియన్ వ్యూస్ సాధించి నెట్‌ఫ్లిక్స్‌ను ఏలుతున్న ‘ఎమోమీ’! మంత్రి సీతక్కను కలిసిన స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్

ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన

Select Suryaa Now
ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన

విజయవాడ, మేజర్ న్యూస్: ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆరోగ్యకరమైన, పర్యావరణహిత జీవనశైలిపై అవగాహన పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 129 డిపోలు, యూనిట్లలో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు ‘ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం’ అనే ఇతివృత్తంతో విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో యోగా కార్యక్రమం నిర్వహించారు. సుమారు 50 మంది అధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రముఖ యోగా మాస్టర్లు తులసీ కృష్ణ, మురళీ కృష్ణ ఆధ్వర్యంలో వివిధ యోగాసనాలను ప్రదర్శించారు. యోగా ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఒత్తిడి నియంత్రణ సాధ్యమవుతాయని వివరించారు. ఉద్యోగులు నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యాధరపురంలోని ఏపీఎస్‌ఆర్టీసీ ఆసుపత్రి ముఖ్య వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత రెడ్డి ఉద్యోగులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. క్రమబద్ధమైన వ్యాయామం, యోగా, సమతుల్య ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని తెలిపారు. ఈ వారోత్సవాల్లో భాగంగా ఆరోగ్యకరమైన జీవనశైలి, ఇంధనం, నీటి సంరక్షణ, సుస్థిర ఆహార విధానాలు, ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్‌ వినియోగ నియంత్రణ, ఎలక్ట్రానిక్ వ్యర్థాల తగ్గింపు, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ఏడు రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక సమన్వయ అధికారిని నియమించి రాష్ట్రస్థాయిలో కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. కార్యక్రమం ముగింపులో ఏపీఎస్‌ఆర్టీసీ కార్యనిర్వాహక సంచాలకులు (పరిపాలన) కె.ఎస్. బ్రహ్మానంద రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. యోగా మాస్టర్లు తులసీ కృష్ణ, మురళీ కృష్ణతో పాటు ఆరోగ్య సూచనలు అందించిన డాక్టర్ శ్రీకాంత రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు యోగా, ఆరోగ్య సూచనలను రోజువారీ జీవితంలో పాటించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల నిర్వహణను కార్యనిర్వాహక సంచాలకులు (పరిపాలన) కె.ఎస్. బ్రహ్మానంద రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

 

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.