శ్రీ గురప్ప స్వామికి సోమవారం ప్రత్యేక పూజలు
వింజమూరు, మేజర్ న్యూస్ : వింజమూరు నడుమూరు నందు వేంచేసియున్న శ్రీ గురప్ప స్వామి అంకాలమ్మ నాగవరపమ్మ అమ్మవార్లకు సోమవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయాన్నే స్వామివారికి అమ్మవారి లకు ప్రత్యేకంగా అభిషేకములు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు ఉదయాన్నే ఆలయాన్ని చేరుకుని స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామివారికి కాయ కర్పూరంచెల్లించి మొక్కులు తీర్చుకున్నారు తీర్థ ప్రసాదములు స్వీకరించి పునీతులయ్యారు.