పర్యావరణానికి హానికరం లేని సుస్థిర జీవనశైలి అలవర్చుకోవాలి
గరుగుబిల్లి, సూర్య : సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన పర్యావరణహితమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సంక ల్పంతో ప్రభుత్వం బ్రిక్స్ సుస్థిర జీవన శైలి వారోత్సవాలను ఈనెల 7వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని పార్వతిపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.విజయలక్ష్మి వెల్లడించారు.మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరును సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పరిశీలించారు. తుఫాన్ కారణంగా వర్షాలు కురుస్తు న్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎన్ ఎం కె తిరుమలప్రసాద్ కు సూచించారు.వైద్య సహాయం నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు వచ్చే వారితో డి ఎం అండ్ హెచ్ ఓ మాట్లాడారు.అదే విధంగా అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు.అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి విజయలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన పెంచడం మరియు రోజువారి అలవాట్ల లో మార్పులు తీసుకురావడం బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల ఉద్దేశ మని పేర్కొన్నారు.పెరుగుతున్న ఊబకాయం,మధుమేహం,బీపీ వంటి అంటువ్యాధులు కాని దీర్ఘకాలిక రోగాలను అరికట్టడానికి దైనందిన జీవితంలో వ్యాయామo, యోగా మరియు సమతుల్య ఆహారం ఎంత అవసరమో గ్రామాల్లో ప్రత్యేక కార్యక్ర మాలు నిర్వహించి ప్రజలకు వైద్యాధి కారులు తెలియజేయడం జరుగుతుం దన్నారు.ప్రజల్లో ఆరోగ్యంపై అవగా హన పెంచడం మరియు పర్యావరణ హిత జీవన విధానాలను ప్రోత్సహించ డమే ఈవారోత్సవాల ముఖ్య ఉద్దేశమ ని తెలిపారు.వారోత్సవాలలో భాగము గా మంగళవారం నీటి సంరక్షణ, లీకేజీల తనిఖీ,వర్షపు నీటి నిల్వపై అవగాహన, క్యాంపస్ వాటర్ ఆడిట్ తదితర కార్యక్రమాలను నిర్వహించ డం జరుగుతుందన్నారు.4వ తేదీన స్థిరమైన ఆహార పద్ధతులు చిరుధాన్యా లు,సంప్రదాయ ఆహార ప్రదర్శనలు, ఆహార వృధా నివారణ,5 వ తేదీన ప్లాస్టిక్ రహిత సమాజం,సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధ ప్రచారం, ప్లాస్టిక్ వ్యర్ధాల సేకరణపై డ్రైవ్ లు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఆరవ తేదీన ఈ-వ్యర్ధాల తగ్గింపు ఎలక్ట్రానిక్ వ్యర్ధాల సేకరణ, రీసైక్లింగ్ సంస్థలకు అప్పగించడం,మొబైల్ మరియు ల్యాప్ టాప్ రిపేర్ పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.ఏడవ తేదీన సాధారణ వ్యర్ధాలు తగ్గింపు క్యాంపస్ మరియు పరిసరాల పరిశుభ్రత తడి పొడి చెత్త వేరు చేయడం పాఠశాలలు మరియు విద్యుత్తు శాఖ భాగస్వామ్యం తో వారోత్సవాల కార్యక్రమాలను నిర్వ హించాలని వైద్య సిబ్బందికి తెలియజే యడం జరిగిందన్నారు.ఈపరిశీలనలో వైద్యాధికారి డాక్టర్ ఎన్ ఎం కె తిరుమలప్రసాద్, వైద్య సిబ్బంది ఎన్ జగదీశ్వరి, చింతాడ ఉదయకుమారి, దాసరి మృత్యుంజయరావు, పొన్నగంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.