BREAKING
షబ్బీర్ మృతి పట్ల అనంత వెంకటరామిరెడ్డి సంతాపం భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు పరామర్శ వర్లీ లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం. మాత శిశు మరణాల పై ప్రత్యేక సమీక్ష సమావేశం జోరు వానలోనూ తగ్గని జోరు.. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి..ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్. ఆనందపురం జడ్పీటీసీకి చతుర్ముఖ పోరు...!! బోని గ్రామంలో గెలుపు దిశగా తాట్రాజ్ అప్పారావు జోరు.... కళా ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం చిత్తూరు మండలంలో టిడిపి ఇంటింటి ప్రచారం - ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సతీమణి కంచెర్ల ప్రతిమ - ఎంపీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి మంజుల శశికర్ బాబు పీజీ ఎంబి ఎ ఎంసీ ఎ ఫలితాలు విడుదల నిష్పక్షపాత, అప్రమత్తం విధులు.. పటిష్ట భద్రత.. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం * జిల్లా ఎస్పీ * ఉపాధి హామీ పనిదినాలను125 నుంచి 225 రోజులకు పెంచాలి వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి ఏఐవైఫ్ నేటితో పరిషత్‌ ఎన్నికల ప్రచారానికి తెర.. * జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ * ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎర్రన్నాయుడు సేవలు చిరస్మరణీయం నేటితో పరిషత్‌ ప్రచారానికి తెర.... *​ జిల్లా కలెక్టర్‌ ఎస్. రాంసుందర్ రెడ్డి *

గ్రామపంచాయతీ స్థలం కాపాడాలని ఫిర్యాదు

Select Suryaa Now
గ్రామపంచాయతీ స్థలం కాపాడాలని ఫిర్యాదు

నవాబుపేట సూర్య న్యూస్:నవాబుపేట గ్రామంలోని గ్రామపంచాయతీకి చెందిన స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ సోమవారం నిర్వహించిన మండల ప్రజావాణి కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ క్రిస్టియానాకు గ్రామస్థులు ఫిర్యాదు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పాత బస్టాండ్ సమీపంలోని పోస్టాఫీస్ పక్కన సుమారు 200 గజాల గ్రామపంచాయతీ స్థలం ఉందని,ఇద్దరు వ్యక్తులు ఆ స్థలం తమదంటూ డబ్బాను తొలగించి,చెట్లను తొలగించే ప్రయత్నం చేస్తూ సిమెంట్ పలకలు ఏర్పాటు చేసి ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ స్థలంపై మహబూబ్‌నగర్ జిల్లా కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ పనులు చేపడుతున్నారని తెలిపారు.గతంలో సర్పంచ్,గ్రామ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు.విచారణ పూర్తయ్యే వరకు స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని,ఏర్పాటు చేసిన సిమెంట్ పలకలను తొలగించి గ్రామపంచాయతీ ఆస్తిని పరిరక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోపాల్ గౌడ్,నాయకులు తాహేర్ బృంగి రవీందర్,మెండే అంజయ్య,రాజు,ఫయాజ్,తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.