BREAKING
మహిళల అభివృద్ధికి గ్రామ సమాఖ్య భవనాలు ఎంతో ఉపయోగకరం:: సర్పంచ్ శ్యామల రవివర్మ. మున్సిపల్ కౌంటింగ్ కు ఏర్పాట్లు రాష్ట్ర మహిళ విభాగం కార్యదర్శిగా నాగమణి నియామకం. ఎన్నికల ప్రచారంలో మంత్రి దుర్గేష్ టిఆర్ఏ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పుట్టి సాయిలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్రామాయంపేట మున్సిపల్ పరదిలోని మంజీర విద్యాలయం విద్యార్థి జి. అభిరామ్ రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబే: 9 వికెట్లతో అద్భుత రికార్డు! 33 కేవి విద్యుత్ లైన్‌ను వెంటనే తొలగించండి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పదవీ విరమణ పొందిన ఆర్మీ జవాన్ కు ఘన సన్మానం రోడ్లు, భవనాల నిర్మాణాలపై.... అధికారులతో సమీక్ష సమావేశం .... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైజింగ్ స్టార్స్ ఏసియా కప్: ఇండియా ఏ జట్టు ప్రకటన.. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీకి చోటు! ఘనంగా పిసిసి సభ్యులు మున్నూరు కిషన్ జన్మదిన వేడుకలు రైతు సంక్షేమమే అభివృద్ధికి మూలం.. -పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్ *విద్యుత్ వినియోగదారుల దినోత్సవం*

నిష్పక్షపాత, అప్రమత్తం విధులు.. పటిష్ట భద్రత.. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం * జిల్లా ఎస్పీ *

Select Suryaa Now
నిష్పక్షపాత, అప్రమత్తం విధులు.. పటిష్ట భద్రత.. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం  * జిల్లా ఎస్పీ *

 

శ్రీకాకుళం, సూర్య : ఎం.పి.టి.సి, జెడ్పీ.టి. సి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులు సిబ్బందికి జిల్లా ఎస్పీ  కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు దిశ నిర్దేశాలు చేశారు.ఎన్నికల భద్రత, బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందితో జిల్లా ఎస్పీ  కె.వి. మహేశ్వర రెడ్డి  సోమవారం శ్రీకాకుళం గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్.ఎస్. గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో సమావేశమై ఎన్నికల విధుల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట భద్రత కల్పించాలని, ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన విధులు, పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక గ్రామాలు, మార్గాలు, సంబంధిత అధికారుల సంప్రదింపు నంబర్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా రూట్ మొబైల్ పార్టీల సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ తమకు కేటాయించిన మార్గాల్లో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. విధులకు హాజరయ్యే సిబ్బంది నీట్‌గా యూనిఫాం ధరించి లాఠీ, విజిల్‌తో పాటు అత్యవసర ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ముందస్తు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి 100 మీటర్ల పరిధిని స్పష్టంగా గుర్తించేలా సున్నంతో మార్కింగ్ చేయించాలని, ఆ పరిధిలోకి అనుమతి లేని వ్యక్తులు, వాహనాలను అనుమతించరాదని, వాహనాల పార్కింగ్‌కు కూడా 100 మీటర్ల పరిధి వెలుపలే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలింగ్ ప్రారంభం నుంచే ఓటర్లను క్రమబద్ధమైన క్యూ లైన్లలో పంపిస్తూ ఓటర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, నాయకులు పార్టీ గుర్తులు, కండువాలతో పోలింగ్ కేంద్రాల సమీపంలోకి రాకుండా ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు.ఓటర్లు మొబైల్ ఫోన్లు వెంట తీసుకురాకుండా సహకరించాలి – జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.పి.ఓ మినహా ఎవ్వరు కూడా మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా తనిఖీలు చేపట్టాలని, పోలింగ్ అధికారి పోలీసుల సహాయం కోరినప్పుడు మాత్రమే సిబ్బంది పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాలని,రూట్ మొబైల్ పార్టీలు, ఇతర బందోబస్తు బృందాలు సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచుతూ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. అమలులో ఉన్న ఎన్నికల నిబంధనలు, 30 పోలీసు చట్టాలను కచ్చితంగా పాటిస్తూ 144 సెక్షన్ నిబంధనల ప్రకారం గుంపులుగా చేరకుండా పర్యవేక్షించాలని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల సిబ్బంది, పోలింగ్ సామగ్రి, ఈవీఎంల తరలింపునకు తగిన భద్రత కల్పించి స్ట్రాంగ్ రూమ్‌కు చేరేవరకు అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు, గుంపులుగా చేరి ఘర్షణలకు పాల్పడే పరిస్థితులు తలెత్తకుండా నిఘా కొనసాగించాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఎటువంటి అలసత్వానికి తావులేకుండా ప్రతి ఒక్కరూ సమన్వయంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ  స్పష్టం చేశారు.

అనంతరం మ్యాప్ పాయింట్లు ద్వారా జిల్లాలో ఉన్న 1214 పోలింగ్ లొకేషన్లు, రూట్ మ్యావ్ తదితర అంశాలను జిల్లా ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు విజిలెన్స్ అదనపు ఎస్పీ వివేకానంద, శ్రీకాకుళం డీఎస్పీ సి హెచ్ ధనుంజేయ నాయుడు, టెక్కలి డీఎస్పీ డి లక్ష్మణరావు, కాశీబుగ్గ డీఎస్పీ జి వి రమణ, ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎన్ వెంకట రమణ, ఎస్బి ఇన్స్పెక్టర్ ఇమ్మాన్యూల్ రాజ్,పలువురు సిఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.