రైతు సంక్షేమమే అభివృద్ధికి మూలం.. -పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్
రైతు సంక్షేమమే అభివృద్ధికి మూలం..
-పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్
బెజ్జంకి/మేజర్ న్యూస్:
కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు అండగా నిలుస్తోందని పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్ అన్నారు.మండల పరిధిలోని ముత్తన్నపేట,వీరాపూర్,తోటపెల్లి,బెజ్జంకి క్రాసింగ్,గుగ్గిళ్ల,రేగులపల్లి,చీలాపూర్ గ్రామాల్లో పీఏసీఎస్,ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్ ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా ఒగ్గు దామోదర్ మాట్లాడుతూ.దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే నిబంధనల మేరకు ధాన్యాన్ని విక్రయించి రైతులు మద్దతు ధర పొందాలని సూచించారు.రైతు సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధికి మూలమన్నారు.కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వాహకులు సమన్వయంతో పని చేయాలని పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్ సూచించారు.ఏఎంసీ చైర్మన్ మాతంగి శిరీష,వైస్ చైర్మన్ పర్శ సంతోష్,కాంగ్రెస్ మండలాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్,మాజీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి,సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్,సర్పంచులు గుర్రాల అనురాధ,చిలుముల సతీష్,జెట్టి రమేశ్,గాజ రవళి,జంగిలి లక్ష్మి,శానగొండ స్వరూప,కవ్వంపల్లి అశ్విని,గండికోట సురేష్, డైరెక్టర్లు బైర సంతోష్,కుక్కల రాములు,నూనె రాజేందర్, ఇష్కిల్ల ఐలయ్య,నాయకులు చెప్యాల శ్రీనివాస్,జెల్ల ప్రభాకర్,కుంట హరికృష్ణ,లింగం,రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.(బెజ్జంకి,సూర్య రిపోర్టర్,భాస్కర్)